Bandaru Vijaya Lakshmi : అక్టోబర్ 25న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలయ్- బలయ్ : బండారు విజయ లక్ష్మి
ఎన్నికల నిబందనలకు లోబడే అలయ్ - బలయ్ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టి పడేలా అలయ్ - బలయ్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

Bandaru Vijaya Lakshmi
Bandaru Vijaya Lakshmi – Alai-Balai Program : హైదరాబాద్ లో ప్రతి ఏడాది ఆలయ్ – బలయ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 25వ తేదీన నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలయ్ – బలయ్ కార్యక్రమం జరుగనుందని అలయ్- బలయ్ చైర్ పర్సన్ బండారు విజయ లక్ష్మి తెలిపారు. 17 ఏళ్ల నుంచి అలయ్ – బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల నిబందనలకు లోబడే అలయ్ – బలయ్ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టి పడేలా అలయ్ – బలయ్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్, పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవరత్, జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణ, మిజోరాం గవర్నర్ కంభంపాటి హరి బాబు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డితో పాటు ప్రముఖులు అలయ్ – బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వస్తారని పేర్కొన్నారు.