ఎన్నికల్లో ఇదే జరిగితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను: మహేశ్వర్ రెడ్డి

నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. తెలంగాణలో...

ఎన్నికల్లో ఇదే జరిగితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను: మహేశ్వర్ రెడ్డి

Alleti Maheshwar Reddy

తెలంగాణలో తమ పార్టీ 10 ఎంపీ స్థానాలు గెలవబోతుందని, ఒకవేళ కాంగ్రెస్ 14 ఎంపీ స్థానాలు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కీములు ఏమీ లేవని, స్కామ్‌లు, అక్రమాలే ఉన్నాయని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఇందులో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటినప్పటికీ హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని నిలదీశారు. వారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే రూ.5.5 లక్షల కోట్లు కావాలని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో మాయమాటలు చెప్పి కుర్చీ ఎక్కారని అన్నారు.

ఎలా అవినీతి అక్రమలు, భూకబ్జాలు చేయాలనే వారు ఆలోచిస్తున్నారని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడిగా అప్పట్లో అక్రమ భూముల విషయంలో కొట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అదే భూమిని అక్రమార్కులకు అప్పగించారని అన్నారు.

భూ కబ్జాలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు. నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. తెలంగాణలో తమ పార్టీ 10 ఎంపీ స్థానాలు గెలవబోతుందని, ఒకవేళ కాంగ్రెస్ 14 ఎంపీ స్థానాలు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు.

Also Read: 17సీట్లను గెలిచి టీపీఎల్ క‌ప్‌ను గెలవబోతున్నాం : బండి సంజయ్