Mahankali Bonalu : అమ్మవారి బోనాలు, స్వర్ణలత భవిష్యవాణి
సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు. డప్పు దరువులతో భాగ్యనగరం మారుమోగుతోంది. ఆషాఢ మాసాన.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు.

Bonalu
Rangam Bhavishyavani : సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు. డప్పు దరువులతో భాగ్యనగరం మారుమోగుతోంది. ఆషాఢ మాసాన.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. సీఎం కేసీఆర్ సతీమణి సహా.. పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో కీలక ఘట్టం రంగం కార్యక్రమం 2021, జూలై 26వ తేదీ సోమవారం జరుగనుంది.
Read More : Telangana : కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి, వచ్చే నెల నుంచి బియ్యం
రంగం కార్యక్రమంలో అమ్మవారు పూనిన స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తారు. దేశంలో జరిగే.. జరగబోయే విషయాలను రంగం ద్వారా స్వయంగా అమ్మవారే చెబుతారనే విశ్వాసం భక్తుల్లో ఉంది. బోనాలు జాతరలో పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాయంత్రం ఫలహారం బళ్ల ఊరేగించి, అమ్మవారికి సమర్పిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని తెల్లవారుజామునుంచే భక్తులు దర్శించుకుని బోనాలు సమర్పించుకుంటున్నారు. మహంకాళి బోనాల ఉత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై అమ్మవారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు అమ్మవారికి బోనం సమర్పించారు.