Telangana : కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి, వచ్చే నెల నుంచి బియ్యం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తొలిసారిగా రేషన్‌ కార్డులు జారీ చేస్తోంది తెలంగాణ పౌరసరఫరాల శాఖ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ లాంచనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పెండింగ్ అప్లికేషన్ లేకుండా అన్నింటిని పరిశీలించి.. కార్డులు జారీ చేయనుంది కేసీఆర్‌ సర్కార్‌.

Telangana : కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి, వచ్చే నెల నుంచి బియ్యం

Ration Card

New Ration Card : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తొలిసారిగా రేషన్‌ కార్డులు జారీ చేస్తోంది తెలంగాణ పౌరసరఫరాల శాఖ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ లాంచనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పెండింగ్ అప్లికేషన్ లేకుండా అన్నింటిని పరిశీలించి.. కార్డులు జారీ చేయనుంది కేసీఆర్‌ సర్కార్‌. కొత్త రేషన్‌ కార్డుదారులకు.. వచ్చే నెల నుంచే రేషన్‌ బియ్యం అందించనున్నారు.

Read More : Dalit Bandhu : దళిత సాధికారిత, దళితులతో సీఎం కేసీఆర్ సమావేశం

3 లక్షల 9 వేల 83 అప్లికేషన్లు అర్హత సాధించగా.. 8 లక్షల 65 వేల 430 మంది లబ్ధిదారులకు కొత్తగా ప్రతినెల 6 కిలోల బియ్యాన్ని పొందనున్నారు. ఇందుకు నెలకు 5 వేల 200 మెట్రిక్ టన్నులతో సంవత్సరానికి 62 వేల 400 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉన్న కోటాకు అదనంగా పౌరసరఫరాల శాఖ అందించనుంది. ప్రతీనెల 14 కోట్ల రూపాయలతో సంవత్సరానికి దాదాపు 168 కోట్ల రూపాయల్ని అదనంగా వెచ్చించనుంది రాష్ట్ర ప్రభుత్వం.

Read More :Tiruamala Seva Tickets : శ్రీవారి సేవా టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తున్న వారిపై కేసు

నూతన రేషన్ కార్డులలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్ జిల్లాలో ఉన్నాయి. పాతవి దాదాపు 87 లక్షల 41 వేల కార్డులు, లబ్ధిదారులు 2 కోట్ల 79 లక్షల 23 వేలకు అదనంగా కొత్త కార్డులతో కలిపి ప్రస్థుతం రాష్ట్రంలో అన్నిరకాల కార్డులు దాదాపు 90.50 లక్షలు, లబ్ధిదారులు 2 కోట్ల 88 లక్షల మంది ఉన్నారు. ప్రతినెల దాదాపు 231 కోట్లతో సంవత్సరానికి 2 వేల 766 కోట్ల రూపాయల్ని ప్రజాపంపిణీ కోసం ప్రభుత్వం వెచ్చిస్తోంది.