Ganesh Art Exhibition : చిన్నారులు గీసిన గణేశుని చిత్రాలతో ఎగ్జిబిషన్ అదుర్స్.. ఎక్కడంటే?
భాగ్యనగరంలోని ఓ ఏరియాలో 30 మంది చిన్నారులు గీసిన గణేశుని బొమ్మలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసారు. ఆ ఎగ్జిబిషన్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఎక్కడంటే?

Ganesh Art Exhibition
Ganesh Art Exhibition : వినాయకచవితి అంటే అందరికీ ఇష్టమైన పండుగ. ఏటా ఈ పండుగ ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తారు. ఇక గణేశ్ నవరాత్రులు పూర్తయ్యేవరకు ఒకటే సందడి చేస్తారు. వాడవాడలా అనేక వినాయక విగ్రహాలు నిలబెడతారు. ప్రతిరోజు పిల్లలు, పెద్దలు అక్కడ చేరి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇవి సాధారణంగా మనకు కనిపించేవే. అయితే పండుగల సందర్భాల్లో పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ముందుకు వచ్చారు ఆర్టిస్ట్ అక్కిరాజు శ్రీహరి. అందుకోసం ఆయన ఏం చేసారు? చదవండి.

akkiraju srihari
Richest Lord Ganesha : ఇండియాలోనే ఖరీదైన గణపతికి రూ.360.40 కోట్ల బీమా.. ఎక్కడంటే?
పండుగలు అంటే పిల్లలకు ఎంతో సంబరం. ముఖ్యంగా వినాయకచవితి, దీపావళి వంటి పండుగల్లో సందడి చేస్తుంటారు. వినాయకచవితి అనగానే వినాయకుని విగ్రహాలు కొనుగోలు చేస్తాం. కొన్ని స్కూళ్లలో పిల్లల్లో క్రియేటివిటీ పెంచడం కోసం మట్టి విగ్రహాలు తయారు చేయిస్తుంటారు. ఇంట్లో కూడా పేరెంట్స్ వాళ్లతోనే మట్టి విగ్రహం తయారు చేయిస్తుంటారు. ఇక మండపాల్లో వినాయక విగ్రహాల ముందుర పిల్లల కోసం డాన్సులు, ఆటలు, తంబోలాలు ఈ వేడుకలు ఎలానూ ఉంటాయి. వీటన్నిటితో పాటుగా వాళ్లలో బొమ్మలు గీసే కళను ప్రోత్సహించడం కోసం వినూత్న ప్రయత్నం చేసారు బండ్లగూడకు చెందిన విశ్రాంత ఇంజనీర్ అక్కిరాజు శ్రీహరి. ప్రవృత్తి పరంగా ఆర్టిస్ట్ అయిన శ్రీహరి గారు దాదాపుగా 30 మంది పిల్లలతో గణేశుని బొమ్మలు వేయించారు.

bandlaguda
మురారి గిరిధర్ హోమ్స్, కిస్మత్ పురా, బండ్లగూడకు చెందిన అక్కిరాజు శ్రీహరి 4 నుంచి 12 సంవత్సరాల వయసున్న 30 మంది పిల్లలతో గణేశుని బొమ్మలు గీయించారు. ఆయన దగ్గరకు మొదటిరోజు బొమ్మలు వేయడానికి ఇద్దరు పిల్లలే వచ్చారట. ఆ తరువాత ఆ సంఖ్య 30 కి పెరిగింది. ఇక వారందరూ గీసిన అందమైన గణేశుని చిత్రాలతో వినాయకచవితినాడు ప్రదర్శన ఏర్పాటు చేసారు. అంతేనా బొమ్మలు గీసిన చిన్నారులందరికీ బహుమతులు ఇచ్చారు. వీరు గీసిన చిత్రాల వీడియో kavyas_canvas అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కూడా మీరు చూడచ్చు.

ganesh arts
Ganesh Chaturthi 2023 : భూగర్భంలో బొజ్జ గణపయ్య .. చెవిలో చెబితే కోరికలు తీర్చే స్వామి
పండుగ సందర్భాల్లో వారిలోని క్రియేటివిటీని ఎలా బయటకు తీసుకురావాలి? అనే ఆలోచనతో అక్కిరాజు శ్రీహరి మంచి ప్రయత్నం చేసారని అందరూ అభినందిస్తున్నారు. చిన్నారుల చిత్రాలతో కళకళలాడుతున్న ఎగ్జిబిషన్ 28 సెప్టెంబర్ వరకు ఉండొచ్చని తెలుస్తోంది. వీలైనవారు ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించండి.
View this post on Instagram