Intelligence DSP Stuck Lift : హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ డీఎస్పీకి తృటిలో తప్పిన ప్రమాదం
హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ డీఎస్పీకి తృటిలో ప్రమాదం తప్పింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటెలిజెన్స్ డీఎస్పీతోపాటు మరో వ్యక్తికి పెను ప్రమాదం తప్పింది.

stuck in a lift
Intelligence DSP Stuck Lift : హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ డీఎస్పీకి తృటిలో ప్రమాదం తప్పింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటెలిజెన్స్ డీఎస్పీతోపాటు మరో వ్యక్తికి పెను ప్రమాదం తప్పింది. హైదర్ గూడ వద్ద హోటల్ లిఫ్ట్ లో ఇంటెలిజెన్స్ డీఎస్పీ సత్యనారాయణ లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు.
హోటల్ సిబ్బంది వెంటనే ఎలక్ట్రీషియన్ అక్కడికి రప్పించి మరమ్మతులు చేస్తుండగా అతను కూడా లిఫ్ట్ లో ఇరుక్కు పోయాడు. చాలా సేపటి వరకు లిఫ్ట్ తెరుచుకోకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Teacher Dies In Lift : స్కూల్‌లో తీవ్ర విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని టీచర్ మృతి
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిపుణుల సహాయంతో ఇంటెలిజెన్స్ డీఎస్పీతోపాటు మరో వ్యక్తిని బయటికి తీయించారు. ఇద్దరు స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం వారిని ఆస్పత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు.