Minor Girl Raped : ఈ నగరానికి ఏమైంది? పాతబస్తీలో మరో దారుణం, బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారం
జూబ్లీహిల్స్ లో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన మరువక ముందే మరిన్ని దారుణాలు వెలుగుచూస్తున్నాయి. పాతబస్తీలో వరుసగా అత్యాచార ఘటనలు బయటపడుతున్నాయి.

Minor Girl Raped
Minor Girl Raped : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన మరువక ముందే మరిన్ని దారుణాలు వెలుగుచూస్తున్నాయి. పాతబస్తీలో వరుసగా అత్యాచార ఘటనలు బయటపడుతున్నాయి. మొఘల్ పుర ఘటన మరువక ముందే.. మరో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది.
కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఓ ఆటోడ్రైవర్ ఆమెపై అత్యాచారం చేశాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రెండు రోజులు తర్వాత బాలికను వదిలిపెట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో కాలాపత్తార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Girl Rape : కరోనా మందు పేరిట మత్తుమందు ఇచ్చి బాలికపై అత్యాచారం
ఇదే కాదు.. మరో అఘాయిత్యం కూడా జరిగింది. బాలికపై క్యాబ్ డ్రైవర్, అతడి స్నేహితుడు అత్యాచారం చేశారు. గత నెల 31న రాత్రి పది గంటల సమయంలో పహాడీ షరీఫ్‌కు చెందిన పదకొండేళ్ల బాలిక ఒంటరిగా తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తోంది.
ఆ సమయంలో అదే రూట్ లో వెళ్తున్న క్యాబ్ డ్రైవర్ షేక్ కలీమ్ అలీ.. ఒంటరిగా ఉన్న బాలికను చూసి క్యాబ్ ఆపాడు. ఎక్కడికి వెళ్లాలని బాలికను అడిగాడు. తాను ఇంటికి వెళ్తున్నానని, క్యాబ్ ఎక్కేందుకు తన దగ్గర డబ్బులు లేవని చెప్పింది. డబ్బులు లేకున్నా, ఆమె ఇంటి దగ్గర దిగబెడతానని బాలికను నమ్మించి, కారు ఎక్కించుకున్నాడు. తర్వాత మార్గమధ్యంలో కలీమ్ అలీ తన స్నేహితుడు మహమ్మద్ లుక్మాన్ అహ్మద్‌ను కారులో ఎక్కించుకున్నాడు. అయితే, కారు బాలిక ఇంటివైపు కాకుండా, లుక్మాన్ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై ఇధ్దరూ కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
JubileeHills Gang Rape Case : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు.. మిగతా ఇద్దరూ అరెస్ట్
బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ తర్వాత మరుసటి రోజు ఉదయం బాలికను సుల్తాన్ షాహి ప్రాంతంలో వదిలిపెట్టారు. ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు బాలిక కనిపించింది. వెంటనే బాలికను భరోసా సెంటర్‌కు తరలించి, ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేశారు.
Rape On Girl : జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్ కేసు..రోడ్లపై తిప్పుతూ కారులోనే బాలికపై ఐదుగురు అత్యాచారం
నగరంలో వరుస అత్యాచారాలు కలవర పెడుతున్నాయి. ఆడపిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి తిరిగి సురక్షితంగా ఇంటికి చేరేవరకు టెన్షన్ పడే పరిస్థితి నెలకొంది.