Hyderabad : హైదరాబాద్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. మద్యం మత్తులో కారుతో స్కూటర్‌ను గుద్దిపడేసిన మహిళ.. ఒళ్లుగగుర్పొడిచే యాక్సిడెంట్ వీడియో
Hyderabad Car Accident: మగవాళ్లే కాదు ఆడవాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. ఫుల్లుగా మందు తాగి వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. మద్యం మత్తులో..

Hyderabad Car Accident (Photo : Google)
Hyderabad Car Accident : డ్రంక్ అండ్ డ్రైవింగ్ మంచిది కాదు. మీ ప్రాణాలకే కాదు ఎదుటి వారి ప్రాణాలకు కూడా ప్రమాదమే. మద్యం మత్తులో వాహనాలు నడపటం నేరం కూడా. మద్యం మత్తులో వాహనాలు నడపటం వల్ల ఎంతటి ఘోర ప్రమాదాలు జరిగాయో కళ్లారా చూశాం, చూస్తున్నాం కూడా. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మందుబాబులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా, అరెస్ట్ చేసి జైల్లో వేస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు.
మగవాళ్లే కాదు ఆడవాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. ఫుల్లుగా మందు తాగి వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ తో ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ లో అలాంటి షాకింగ్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. (Hyderabad Car Accident)
బంజారాహిల్స్ లో బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వస్తున్న స్కూటర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకర్ కు తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. స్కూటర్ పై వెళ్తున్న జీహెచ్ఎంసీ ఉద్యోగిని అతివేగంగా దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. అనంతరం స్కూటర్ ని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్కూటీ మీదున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, కారు నడిపిన మహిళ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెన్నులో వణుకుపుట్టించే విధంగా ఈ యాక్సిడెంట్ జరిగింది.(Hyderabad Car Accident)
జీహెచ్ఎంసీ ఉద్యోగి తన స్కూటర్ పై వెళ్తున్నాడు. బీఎండబ్ల్యూ కారు వేగంగా తనవైపు దూసుకు రావడాన్ని అతడు గమనించాడు. దాంతో స్కూటర్ ను స్లో చేశాడు. రోడ్డు పక్కగా ఆపేశాడు. కానీ, లాభం లేకపోయింది. ప్రమాదం నుంచి అతడు తప్పించుకోలేకపోయాడు. జెట్ స్పీడ్ తో దూసుకొచ్చిన కారు.. చాలా బలంగా స్కూటర్ ను ఢీకొట్టింది. అంతే, క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఇదంతా రికార్డ్ అయ్యింది.
కాగా, హైదరాబాద్ లో వరుస రోడ్డు ప్రమాదాలు నగరవాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నగరంలోని రోడ్లపై కార్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల నగర శివారులోని బండ్లగూడలో కారు బీభత్సం సృష్టించింది. మార్నింగ్ వాకింగ్ చేస్తున్న మహిళలపైకి హోండా స్పోర్ట్స్ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లీ కుమార్తెలు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ర్యాష్ డ్రైవింగ్ ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు నిర్ధారించారు.(Hyderabad Car Accident)
ర్యాష్ డ్రైవింగ్ కారణంగా జరుగుతున్న ఈ వరుస ప్రమాదాలు నగరవాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ రూపంలో మృత్యువు దూసుకొస్తుందోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్లే వరకు కటుంబసభ్యులు కంగారు పడే పరిస్థితి నెలకొంది.
#WATCH | Telangana | Hit and run incident reported in Banjara Hills PS limits in Hyderabad. A GHMC employee namely Bala Chander Yadav’s two-wheeler was rammed by a speeding BMW car today in Banjara Hills police station limits. The accident happened after the driver lost control… pic.twitter.com/vbOobHGjtj
— ANI (@ANI) July 7, 2023