బ్రహ్మోత్సవాలకు రండి…కేసీఆర్ కు జగన్ ఆహ్వానం

  • Published By: venkaiahnaidu ,Published On : September 23, 2019 / 03:04 PM IST
బ్రహ్మోత్సవాలకు రండి…కేసీఆర్ కు జగన్ ఆహ్వానం

Updated On : September 23, 2019 / 3:04 PM IST

హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో ఇవాళ(23 సెప్టెంబర్ 2019) తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆహ్వాన పత్రికను అందజేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సీఎం వైఎస్ జగన్ వెంట ఉన్నారు.

ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, నాయకులు, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో గోదావరి జలాల తరలింపు, విభజన అంశాలు, ఆర్థిక మాంద్యంతో పాటు తాజా రాజకీయాలపై సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఇంతకుముందు కూడా జగన్, కేసిఆర్ రెండు సార్లు భేటి అయ్యి పలు అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. కాగా ఇవాళ ముచ్చటగా మూడోసారి సమావేశమై పలు అంశాలపై చర్చించా