Drugs Case: కేపి చౌదరి డ్రగ్స్ కేసు.. స్పందించిన ఆషురెడ్డి, సురేఖ వాణి

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్‌బాస్ ఫ్రేమ్ ఆషురెడ్డి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. డ్రగ్స్ కేసులో తమను బదనం చేయడం బాధాకరం అన్నారు.

Drugs Case: కేపి చౌదరి డ్రగ్స్ కేసు.. స్పందించిన ఆషురెడ్డి, సురేఖ వాణి

Tollywood Drugs Case

Tollywood Drugs Case: కబాలి తెలుగు సినిమా నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ అలియాస్ కేపి చౌదరి (KP Chaudhary) డ్రగ్స్ కేసు (Drugs Case) లో సంచలనం విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్‌ (Tollywood) కు చెందిన పలువురికి కేపీ చౌదరి డగ్స్ విక్రయించినట్లు రెండు రోజులుగా పోలీసులు జరుపుతున్న విచారణలో వెల్లడైంది. పలు టాలీవుడ్ ప్రముఖులు ఈ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు బిగ్‌బాస్ ఫెమ్ అషు‌రెడ్డి‌, జ్యోతి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణితోపాటు సుశాంత్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆషురెడ్డి, సుశాంత్ రెడ్డి, సురేఖ వాణిలు స్పందించారు.

Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సంచలనం.. కేపీ చౌదరి లిస్టులో సెలబ్రిటీల పేర్లు, ఆ ఇద్దరితో వందల సంఖ్యలో ఫోన్ కాల్స్

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్‌బాస్ ఫ్రేమ్ ఆషురెడ్డి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. డ్రగ్స్ కేసులో తమను బదనం చేయడం బాధాకరం. నిజాలను బయటకు రానివ్వండి. స్పందించాల్సిన సమయంలో స్పందిస్తా అని‌ అషు రెడ్డి అన్నారు. తన మొబైల్ నెంబర్‌ను బహిర్గతం చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. నటి సురేఖ వాణి స్పందిస్తూ.. డ్రగ్స్ పై వస్తున్న ఆరోపణలతో తనకు సంబంధం లేదని అన్నారు. ఇప్పుడు తన ఆరోగ్యం బాగాలేదని తర్వాత స్పందిస్తానని నటి సురేఖ వాణి చెప్పారు.

Drugs Case: నిర్మాత కేపి చౌదరి డ్రగ్స్ కేసు విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు.. సుశాంత్ రెడ్డి ఏమన్నారంటే?

డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి చెప్పిన లిస్ట్‌లో సుశాంత్ రెడ్డి పేరుకూడా ఉంది. సుశాంత్ రెడ్డి టాలీవుడ్ యాక్టర్. తాజాగా సుశాంత్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. నాకు కేపీ చౌదరి ఒక ప్రొడ్యూసర్‌గా మాత్రమే తెలుసు. కొన్నిసార్లు కలిశాను. అప్పుడప్పుడు కాల్స్ మాట్లాడాను. మూడేళ్ల నుంచి ఆయనను కలవలేదని అన్నారు. నాకు డ్రగ్స్ అలవాటు లేదు. డ్రగ్స్ పరంగా ఎలాంటి సంబంధం లేదు. మా మధ్య ఆ టాపిక్ కూడా రాలేదని సుశాంత్ రెడ్డి చెప్పారు. ఎలాంటి టెస్ట్‌కి అయినా నేను రెడీ. పోలీసుల నుంచి ఎదైనా కాల్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నా. ఎలాంటి విచారణకు అయినా సిద్ధంగా ఉన్నాను అని సుశాంత్ రెడ్డి అన్నారు. ఇదిలాఉంటే కేపీ చౌదరితో సంబంధం ఉన్న పలువురికి నోటీసులు ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు.