Mohan babu : జర్నలిస్ట్ రంజిత్‌కు క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు..

స్వయంగా ఆసుపత్రికి వెళ్లి జర్నలిస్ట్ రంజిత్ ను పరామర్శించిన మోహన్ బాబు.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Mohan babu : జర్నలిస్ట్ రంజిత్‌కు క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు..

Updated On : December 15, 2024 / 5:58 PM IST

Mohan babu : మీడియా ప్రతినిధులపై దాడి ఘటనలో సినీ నటుడు మోహన్ బాబు దిగొచ్చారు. జర్నలిస్ట్ సమాజం నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్ ను మోహన్ బాబు పరామర్శించారు. అనంతరం రంజిత్ కు క్షమాపణ చెప్పారు. అలాగే రంజిత్ కుటుంబసభ్యులను కూడా మోహన్ బాబు క్షమాపణలు కోరినట్లు తెలుస్తోంది. ఆవేశంలో తాను దాడి చేశానని మోహన్ బాబు ఒప్పుకున్నారు. ఆసుపత్రికి వెళ్లి జర్నలిస్ట్ రంజిత్ ను పరామర్శించిన మోహన్ బాబు.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

మోహన్ బాబు కుటుంబంలో ఘర్షణల వ్యవహారంలో కవరేజ్ చేసేందుకు మోహన్ బాబు నివాసానికి వెళ్లిన జర్నలిస్టులపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. జర్నలిస్ట్ రంజిత్ పై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడిలో రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం దుమారం రేపింది. మోహన్ బాబు తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో మోహన్ బాబు దిగొచ్చారు. యశోద ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న రంజిత్ ను పరామర్శించారు. రంజిత్ కు, ఆయన ఫ్యామిలీకి సారీ చెప్పారు మోహన్ బాబు.

ఆదివారం సాయంత్రం మోహన్ బాబు నేరుగా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లారు. రంజిత్ ను కలిశారు. తన తప్పిదం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు మోహన్ బాబు. గాయం ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. తనను క్షమించాలని రంజిత్ ను మోహన్ బాబు కోరారు. రంజిత్ త్వరగా కోలుకోవాలని మోహన్ బాబు కోరుకున్నారు.

విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్ పై మోహన్ బాబు దాడి చేయడం సంచలనం రేపింది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మోహన్ బాబుపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద హత్యాయత్నం కేసు నమోదైంది.

Also Read : కూల్చేస్తారా? బాలకృష్ణ, జానారెడ్డి ఇళ్లకు మార్కింగ్ వేసిన జీహెచ్ఎంసీ..