GHMC Marking : బాలకృష్ణ, జానారెడ్డి ఇళ్లకు మార్కింగ్ వేసిన జీహెచ్ఎంసీ.. ఏం జరుగుతోంది?
జానారెడ్డి, బాలకృష్ణ ఇళ్లు కూడా ఉండటంతో వీరి ఇళ్లకు అధికారులు మార్కింగ్ చేశారు.

GHMC Marking : కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో ముందడుగు పడింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 86 ఆస్తులను సేకరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. 86 ఆస్తుల్లో పలువురు ప్రముఖులకు చెందిన నివాసాలు కూడా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, సినీ నటుడు-టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇళ్లు కూడా ఉండటంతో వీరి ఇళ్లకు అధికారులు మార్కింగ్ చేశారు.
హైదరాబాద్ నగరంలో రోడ్ డెవలప్ మెంట్ పై రేవంత్ సర్కార్ ఫోకస్ చేసింది. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్ల డెవలప్ మెంట్ ప్రక్రియ పూర్తవగా.. కొత్తగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఉండే జంక్షన్లను డెవలప్ చేయాలని నిర్ణయించారు. ఆరు జంక్షన్లలో ఈ పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ డిసైడ్ చేసింది. దీని చుట్టూ ఉండే అన్ని జంక్షన్లను క్లియర్ చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యను తగ్గించడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. కొన్ని ప్రాంతాల్లో అండర్ పాస్ లు, మరికొన్ని ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఆ ఫ్లైఓవర్ లన్నీ స్టీల్ తో నిర్మాణం చేయాలని నిర్ణయించారు.
అగ్రసేన్ జంక్షన్ లో అండర్ పాస్, ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. అగ్రసేన్ జంక్షన్ కు సంబంధించి క్యాన్సర్ ఆసుపత్రి నుంచి, బంజారాహిల్స్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను, జూబ్లీహిల్స్ వైపు నుంచి బంజారాహిల్స్ కు వచ్చే ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యే విధంగా ఈ జంక్షన్ ను ఫ్రీగా చేయాలని నిర్ణయిచింది. ఈ జంక్షన్ డెవలప్ మెంట్ తో ఇక్కడ ట్రాఫిక్ సమస్య తగ్గనుంది. ఈ ప్రాంతంలో ఆస్తులకు సేకరణకు సంబంధించి ప్రక్రియ మొదలైంది. 20 అడుగుల వరకు స్థలం సేకరించాల్సి ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి.. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి కూడా అధికారులు మార్కింగ్ చేయడం కలకలం రేపుతోంది.
1100 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ట్రాఫిక్ ఫ్రీగా ఉండే విధంగా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోంది. రోడ్డు విస్తరణ పనులన్నీ 3 నెలల్లో ప్రారంభించాలని ప్రభుత్వం చెప్పడంతో.. దానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే టెండర్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
* కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న రోడ్డు విస్తరణ ప్రాజెక్ట్ లో ముందడుగు
* కేబీఆర్ పార్క్ చుట్టూ 86 ఆస్తులను సేకరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయం
* 86 ఆస్తుల్లో పలువురు ప్రముఖులకు చెందిన నివాసాలు
* కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి స్థలం సేకరణ
* పలువురు రాజకీయ, పారిశ్రామికవేత్తల ఆస్తులను సేకరించనున్న ప్రభుత్వం
* ఒక్కొక్క ఆస్తి నుండి 200 నుంచి 400 గజాల వరకు సేకరణ
* అందరూ ప్రముఖులే ఉండటంతో ఆస్తులు ఇస్తారా లేదా అనేది హాట్ టాపిక్
* మూడు నెలల్లో ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశం
* వారం రోజుల్లో ప్రారంభం కానున్న టెండర్ ప్రక్రియ
Also Read : సంధ్య థియేటర్ ఘటన.. సినీ పరిశ్రమ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ప్రభుత్వం తీసుకోవాల్సింది ఏంటి?