సంధ్య థియేటర్ ఘటన.. సినీ పరిశ్రమ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ప్రభుత్వం తీసుకోవాల్సింది ఏంటి?
బన్నీ అరెస్ట్, జైల్, బెయిల్, రిలీజ్ వరకు 18 గంటల రన్ టైమ్ తో రియల్ షో.. బ్లాక్ బస్టర్ పిక్చర్ ను మంచిన సస్పెన్స్, థ్రిల్లర్ ను తలపించింది.

Allu Arjun Arrest : పుష్ప.. నామ్ చోటా హై, సౌండ్ బడా హై.. ఇది సినిమా డైలాగే అయినా.. ఆ సినిమా చుట్టూ జరిగిన కాంట్రవర్సీ మాత్రం బ్లాస్టింగ్ న్యూస్. స్టేట్ నుంచి నేషనల్ వరకు.. పాలిటిక్స్ ను, సినీ స్టార్స్ ను షేక్ చేసింది. మూవీ రిలీజ్, సక్సెస్, కలెక్షన్స్.. ఇవన్నీ ఒక ఎత్తైతే.. ఒకే ఒక ఇన్సిడెంట్ పుష్పరాజ్ ను టాక్ ఆఫ్ ద కంట్రీగా మార్చేసింది. బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఘటనపై బన్నీ అరెస్ట్, జైల్, బెయిల్, రిలీజ్ వరకు 18 గంటల రన్ టైమ్ తో రియల్ షో.. బ్లాక్ బస్టర్ పిక్చర్ ను మంచిన సస్పెన్స్, థ్రిల్లర్ ను తలపించింది. ఈ నేపథ్యంలో అసలు పుష్పరాజ్ ఇన్సిడెంట్ నేర్పుతున్న పాఠం ఏంటి? తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం తీసుకోవాల్సింది ఏంటి? సినీ ఇండస్ట్రీ నేర్చుకోవాల్సింది ఏంటి?
సినిమా, పబ్లిక్, ప్రభుత్వం.. ఈ మూడు ఇంటర్ లింక్. మూవీ షూటింగ్ నుంచి రిలీజ్ వరకు ప్రతీదానికి ప్రభుత్వ సహకారం అవసరం. పబ్లిక్ రెస్పాన్స్, ఆదరణ ఉంటేనే సినిమాలకు, సినీ స్టార్లకు సక్సెస్ ఉంటుంది. మూవీ షూటింగ్స్ కు పర్మిషన్ ఇచ్చినా, టికెట్ల రేట్లపైనా ప్రభుత్వానికి ఇన్ కమ్ ఉంటుంది.
అలాంటప్పుడు సినిమా ఈవెంట్లకు వెళ్లే జనాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? సర్కార్ పర్మిషన్ ఇచ్చినంత మాత్రాన ప్రజల ప్రాణాలపై సినీ స్టార్లకు, మూవీ యూనిట్లకు బాధ్యత ఉండదా? అందరూ చేతులు దులిపేసుకుంటే.. ఎవరిది బాధ్యత? అటు ప్రభుత్వం ఇటు సినీ పరిశ్రమ తమకేమీ సంబంధం లేదంటే ఎట్లా?
పూర్తి వివరాలు..