Hyderabad Crime : ఆటోలో మహిళపై అత్యాచారయత్నం

ఆటో ఎక్కిన ప్రయాణికురాలిపై.. డ్రైవర్ అతని స్నేహితుడు అత్యాచారానికి యత్నించారు. ఈ ఘటన నగరంలోని పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

Hyderabad Crime : ఆటోలో మహిళపై అత్యాచారయత్నం

Hyderabad Crime (4)

Updated On : November 10, 2021 / 7:15 AM IST

Hyderabad Crime :  ఆటో ఎక్కిన ప్రయాణికురాలిపై.. డ్రైవర్ అతని స్నేహితుడు అత్యాచారానికి యత్నించారు. ఈ ఘటన నగరంలోని పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫలక్ నుమా వట్టేపల్లికి చెందిన మహిళ (35) కాటేదాన్ పనిచేస్తుంది. పని ముంగించుకొని సోమవారం రాత్రి ఆటో ఎక్కింది. ఇక కొద్దీ దూరం మెయిన్ రోడ్డుపైనే తీసుకెళ్లిన డ్రైవర్ అనంతరం దారి మళ్ళించాడు.

చదవండి : Hyderabad Crime : చిన్న గొడవ.. క్షణికావేశంలో భర్తపై కత్తితో దాడి

ఆటోలో ఉన్న తన స్నేహితుడితో కలిసి అత్యాచారయత్నం చేశాడు. డేసీ దాబా సమీపంలోకి రాగానే ఆమె కేకలు వేయడంతో ఆమెను అక్కడ దింపేసి పరారయ్యారు. అటునుంచి ఇంటికి వెళ్లిన మహిళ మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు ఆటోనంబర్‌ వివరాలు చెప్పలేకపోవడంతో పోలీసులు కార్గో రోడ్డులో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

చదవండి : Hyderabad Crime : వంటిపై చిరిగిన బట్టలు.. పక్కనే బీరు బాటిల్.. అనుమానాస్పద స్థితిలో డ్యాన్సర్‌ మృతి