Baby Mother Suicide : మూడుసార్లు సర్జరీ చేసినా మానని కుట్లు..నొప్పి భరించలేక బాలింత ఆత్మహత్య
నొప్పులు భరించలేక ఉమ బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఉమ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపించారు. మూడుసార్లు కుట్లు వేసినా.. ఎందుకు సరిగ్గా అతుక్కోలేదని ప్రశ్నించారు.

Suicide
Baby mother suicide at Govt Hospital : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వాస్పత్రిలో ఓ బాలింత ఆత్మహత్య చేసుకుంది. బాత్‌రూంలో ఉరేసుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే….కమాన్‌పూర్ మండలం రొంపికుంటకు చెందిన గుమ్మడి ఉమ ఈ నెల 12 మగ శిశువుకు జన్మనిచ్చింది.
మొదటి కాన్పు కావటంతో కుటుంబ సభ్యులు గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో చేర్చించగా.. డాక్టర్లు సిజేరియన్ చేసి ఐసీయూలో ఉంచారు. ఏడు రోజులకే డిశ్చార్జ్ చేయాల్సి ఉండగా.. ఉమకు కుట్లు మానకపోవడంతో డాక్టర్లు మరోసారి సర్జరీ చేయాలని నిర్ణయించారు.
Omicron In India : దేశంలో 422కు చేరిన ఒమిక్రాన్ కేసులు
దీంతో నొప్పులు భరించలేక ఉమ బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. అయితే ఉమ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపించారు. మూడుసార్లు కుట్లు వేసినా.. ఎందుకు సరిగ్గా అతుక్కోలేదని ప్రశ్నించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.