రేవంత్ మెప్పు కోసం మహేశ్ కుమార్ లేఖ రాసినట్టున్నారు: బాల్క సుమన్
రేవంత్‌కు సలహాలు ఇవ్వాల్సిన మహేశ్ కుమార్ తమకు సలహాలు ఇవ్వడం విడ్డూరమని బాల్క సుమన్ చెప్పారు.

తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్‌ఎస్ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మాజీ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాయడంపై గులాబీ పార్టీ నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మెప్పు కోసం మహేశ్ కుమార్ లేఖ రాసినట్లు ఉందని అన్నారు.
రేవంత్‌కు సలహాలు ఇవ్వాల్సిన మహేశ్ కుమార్ తమకు సలహాలు ఇవ్వడం విడ్డూరమని బాల్క సుమన్ చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి మహేశ్ కుమార్‌కు తెలుసా అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి చేతి నుంచి బతుకమ్మను మాయం చేశారని అన్నారు.
కేటీఆర్, హరీశ్ రావు, కవిత ఉద్యమంలో ఉన్నప్పుడు మహేశ్ కుమార్, రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారని ఆయన నిలదీశారు. రుణమాఫీ, కల్యాణ లక్ష్మీ, అమలు కానీ హామీలు ఎప్పుడు చేస్తారని సీఎం రేవంత్ కు మహేశ్ కుమార్ లేఖ రాయాలని చెప్పారు. ఏడాదిలో కాంగ్రెస్ పార్టీ లక్ష కోట్ల రూపాయల అప్పు చేసి ఏమి చేసిందని అడిగారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాయాల్సిన లేఖ పీసీసీ చీఫ్ తమ పార్టీ అధినేతకు రాసినట్లున్నారని బీఆర్ఎస్ నేత వివేకానంద అన్నారు. ప్రస్తుత పీసీసీ చీఫ్ డమ్మి అభ్యర్థిగా కనిపిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీలుకుంటున్నా పీసీసి చీఫ్ గా గాడిన పెట్టడం లేదని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని రేవంత్‌కు మహేశ్ కుమార్ గౌడ్ చెప్పాలని డిమాండ్ చేశారు.
Mohan babu : జర్నలిస్ట్ రంజిత్‌కు క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు..