చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయానికి చేరుకున్న బండి సంజయ్…సీఎం కేసీఆర్ ఆలయానికి వస్తే ప్రమాణం చేస్తానంటూ సవాల్

Bandi Sanjay arrives Bhagyalakshmi Temple : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయానికి చేరుకున్నారు. ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన సవాల్ మేరకు భాగ్యలక్ష్మీ ఆలయానికి చేరుకున్నానని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలయానికి వస్తే ప్రమాణం చేస్తానంటూ సవాల్ విసిరారు. తనతో చర్చించేందుకు సీఎం కేసీఆర్ వస్తున్నారా లేదా అని ప్రశ్నించారు.
ప్రభుత్వం, టీఆర్ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలకు వివరిస్తానని చెప్పారు. భాగ్యలక్ష్మీ ఆలయానికి బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. చార్మినార్ చుట్టూ ర్యాపిడ్ యాక్షన్ మోహరించారు. చార్మినార్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
వరద సాయం నిలిపివేయాలని ఈసీ లేఖ రాశారన్న అంశం వివాదంగా మారింది. తాను లేఖ రాయలేదని, మ.12గంటలకు భ్యాగలక్ష్మీ ఆలయంలో ప్రమాణం చేస్తానని బండి సంజయ్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ కూడా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఆ మేరకు బండి సంజయ్ శుక్రవారం భాగ్యలక్ష్మీ ఆలయం వద్దకు చేరుకున్నారు.