Bandi Sanjay : అలాంటి గవర్నర్లే బీఆర్ఎస్ కు నచ్చుతారు : బండి సంజయ్
ప్రగతి భవన్ ను తాగి, తినటానికి మాత్రమే కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. సీఎం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు కాబట్టే ప్రజలు రాజ్ భవన్ వైపు చూస్తున్నారని తెలిపారు.

Bandi Sanjay countered Harish
Bandi Sanjay countered Harish Rao : గవర్నర్ తమిళిసైపై మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. ఈ మేరకు హరీష్ రావుకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రబ్బరు స్టాంపు మాదిరి ఉండే గవర్నర్లు మాత్రమే అధికార బీఆర్ఎస్ కు నచ్చుతారని విమర్శించారు.
నిజాయితీగా ఉండే గవర్నర్లు బీఆర్ఎస్ కు నచ్చటం లేదని పేర్కొన్నారు. గవర్నర్ ను హేళన చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమే అవుతుందని తెలిపారు. బీఆర్ఎస్ చేస్తోన్న అవినీతిని గవర్నర్ చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు.
Hyderabad Huge Scam : హైదరాబాద్ లో మరో భారీ మోసం.. రూ.40 కోట్ల స్కామ్ ను బయటపెట్టిన ఐటీ
ప్రగతి భవన్ ను తాగి, తినటానికి మాత్రమే కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. సీఎం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు కాబట్టే ప్రజలు రాజ్ భవన్ వైపు చూస్తున్నారని తెలిపారు. కేసీఆర్.. మహారాష్ట్రకు ముఖ్యమంత్రా? తెలంగాణకు ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు.