Bandi Sanjay: ఎస్టీ నియోజకవర్గాలపై బండి సంజయ్ ఫోకస్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నేతృత్వంలో ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనవరి 19న రాష్ట్రంలోని ST నియోజవర్గాలపై హైదరాబాద్ లో బీజేపీ నేత

Bandi Sanjay
Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నేతృత్వంలో ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనవరి 19న రాష్ట్రంలోని ST నియోజవర్గాలపై హైదరాబాద్ లో బీజేపీ నేతలు మీట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశానికి బండి సంజయ్ కూడా హాజరవనున్నారు.
ఎస్టీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా మాజీ గరికపాటి మోహన్ రావు, సభ్యులుగా చాడా సురేష్ రెడ్డి, కటకం మృత్యుంజయం, కూన శ్రీశైలం గౌడ్ లను నియమించారు.
డిసెంబరు 28నే SC నియోజకవర్గాలపై బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఎస్సీ నియోజకవర్గాలపై మిషన్ 19 పేరుతో ఫోకస్ పెట్టనున్నారు. అదే తరహాలో ఎస్టీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టనున్నారు కమలనాథులు.
ఇది కూడా చదవండి : బీజేపీ బలోపేతంపై ఫోకస్.. జాయినింగ్స్ అండ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు