Bandi Sanjay: బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేయనున్నారు. నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నిరుద్యోగ దీక్ష కొనసాగనుంది.

Bandi Sanjay: బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష

Bandi Sanjay Bjp President

Updated On : December 27, 2021 / 8:39 AM IST

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేయనున్నారు. నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నిరుద్యోగ దీక్ష కొనసాగనుంది. ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేయాలని భావించినప్పటికీ కొవిడ్ నిబంధనల నేపథ్యంలో అనుమతి రాలేదు.

బిస్వాల్ కమిటీ ప్రకారం రాష్ట్రంలో లక్షా 92 వేల ఖాళీలున్నాయని.. వాటిని భర్తీ చేయాలంటూ డిమాండ్ చేస్తూ దీక్షకు పూనుకోనున్నారు. ఏడేళ్లుగా ఒక్క గ్రూప్-1తో మూడేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని బీజేపీ విమర్శలకు దిగింది.

బీజేపీ దీక్ష నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ.. కేంద్ర సంస్థలను అమ్మేస్తున్న బీజేపీకి ఆ అర్హత లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.

rEAD aLSO: కొవిడ్ మూడో డోసు కూడా అదే అయి ఉండాలి

ఉద్యోగాలెప్పుడిస్తారో చెప్పమని అడిగితే కేటీఆర్ ఎదురు దాడి చేస్తున్నారని, రాష్ట్రంలో 600 మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు పరోక్షంగా కేసీఆరే కారణం అంటూ విమర్శించారు రాజా సింగ్. ఈ సందర్భంగా నిరుద్యోగులంతా బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ చేపడుతున్న దీక్షకు సంఘీభావం తెలపాలని కోరారు.