Bandi Sanjay: ఈ డిమాండ్లను పరిష్కరించకుంటే బీజేపీ ఆధ్వర్యంలో మహోద్యమం చేస్తాం: బండి సంజయ్‌

ఇవాళ బండి సంజయ్‌ కరీంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

Bandi Sanjay: ఈ డిమాండ్లను పరిష్కరించకుంటే బీజేపీ ఆధ్వర్యంలో మహోద్యమం చేస్తాం: బండి సంజయ్‌

Bandi Sanjay Kumar

Updated On : December 29, 2024 / 2:29 PM IST

తెలంగాణలో విద్యార్థులకు సంక్రాంతిలోపు ‘‘ఫీజు రీయంబర్స్ మెంట్’’ చెల్లించాల్సిందేనని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రంలో వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ బండి సంజయ్‌ కరీంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

డిమాండ్లను పరిష్కరించుకుంటే బీజేపీ ఆధ్వర్యంలో మహోద్యమం చేస్తామని బండి సంజయ్‌ హెచ్చరించారు. మన్మోహన్ సింగ్ ను రబ్బర్ స్టాంప్ గా మార్చింది కాంగ్రెస్ కాదా అని నిలదీశారు. మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్ ను చింపేసి రాహుల్ గాంధీ అవమానించలేదా అని అడిగారు.

పీవీని అడుగడుగునా అవమానించిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత లేదని బండి సంజయ్ చెప్పారు. ట్రిపుల్ ఆర్ టెండర్లను ఆహ్వానించిన మోదీ ప్రభుత్వానికి తెలంగాణ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

NIrmala Sitaraman: మధ్య తరగతి ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పనుందా.. అదేమిటంటే..?