Weather Alert: బీ అలెర్ట్.. అప్పటికప్పుడు కుండపోత వానలు!

తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజుల నుండి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా, మరో రెండు రోజులు ఇదే తరహాలో భారీ నుండి అతి భారీ వర్షాలు..

Weather Alert: బీ అలెర్ట్.. అప్పటికప్పుడు కుండపోత వానలు!

Telangana Rains

Updated On : September 5, 2021 / 7:04 AM IST

Weather Alert: తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజుల నుండి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా, మరో రెండు రోజులు ఇదే తరహాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, ప్రస్తుతం కురుస్తున్న వానల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖతో పాటు ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది.

బంగాళాఖాతంలో తూర్పు, మధ్యప్రాంతంలో 4.3 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులతో కూడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమవారంలోగా ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. మరోవైపు తెలంగాణ పక్కనే ఛత్తీస్‌గడ్‌పై 2.1 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఉండగా.. భూమికి 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలుల్లో అస్థిరత ఏర్పడింది.

వీటి ప్రభావంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న కారణంగా కారుమబ్బులేర్పడి అప్పటికప్పుడు కొద్దిగంటల్లోనే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఆది, సోమవారాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అనవసరంగా ఇళ్ల నుండి బయటకి రావద్దని సూచించారు.

ముఖ్యంగా జీహెచ్ఎంసి పరిధిలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని.. అప్పటికప్పుడు కుండపోతల వానల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. పలు ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో నగర ప్రజలు అత్యవసర పనులుంటే తప్ప ఇళ్ల నుండి బయటకి రావద్దని సూచించారు.