Kishan Reddy : బీకేర్ ఫుల్.. అక్కడ 5 నెలలుగా కరెంట్ లేదు.. తెలంగాణ ప్రజలను హెచ్చరించిన కిషన్ రెడ్డి

తెలంగాణ ముందుకు వెళ్లాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. బీజేపీని ప్రజలు ఆదరించాలి. Kishan Reddy

Kishan Reddy : బీకేర్ ఫుల్.. అక్కడ 5 నెలలుగా కరెంట్ లేదు.. తెలంగాణ ప్రజలను హెచ్చరించిన కిషన్ రెడ్డి

Kishan Reddy

Updated On : November 1, 2023 / 6:05 PM IST

Kishan Reddy Warns People : బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో అధికార పార్టీపై వ్యతిరేకత ఉందన్నారు కిషన్ రెడ్డి. గ్యారెంటీల పేరుతో కర్ణాటక ప్రజలను మోసం చేసినట్లు తెలంగాణ ప్రజలను కూడా కాంగ్రెస్ మోసం చేస్తుందని ఆరోపించారాయన. కర్ణాటకలో 5 నెలలుగా కరెంట్ లేదన్న కిషన్ రెడ్డి.. 5 రాష్ట్రాల ఎన్నికల కోసం కాంగ్రెస్ ట్యాక్స్ వసూలు చేసి పంపిస్తున్నారని వ్యాఖ్యానించారు. కర్ణాటకను కాంగ్రెస్ దోచుకుంటోందని, దీన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని కిషన్ రెడ్డి కోరారు.

”తెలంగాణ ముందుకు వెళ్లాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. బీజేపీని ప్రజలు ఆదరించాలని. అనేక మంది పార్టీలో చేరుతున్నారు. బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ. కొందరు వెళ్లిపోవడం వల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు. దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీ. వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ వీడితే మేము చేసేదేమీ లేదు.

Also Read : కాంగ్రెస్ పార్టీలో చేరిన వివేక్ వెంకటస్వామి

జనసేనతో సీట్ల సర్దుబాటు చర్చ జరుగుతోంది. నడ్డాతో చర్చించాం. మేనిఫెస్టో భాగస్వాముల మధ్య పెట్టాం. పార్టీ విధానం ప్రకారం మేనిఫెస్టో ఉంటుంది. అందరితో చర్చించాక మేనిఫెస్టో ప్రకటన ఉంటుంది. రాథోడ్ బాపురావు బీజేపీలో చేరడం సంతోషం. మరికొంతమంది బీజేపీలో చేరబోతున్నారు. బీజేపీ సీఈసీ సమావేశంలో కొన్ని సీట్లపై స్పష్టత వస్తుంది. మిగిలిన సీట్లను త్వరలో ప్రకటిస్తాం. 3వ తేదీ నుంచి ప్రచార కార్యక్రమాలు మొదలు పెడతాం. ఎన్నికలకు సమాయత్తం అవుతాం” అని కిషన్ రెడ్డి అన్నారు.

ఆదిలాబాద్ టికెట్ ఇస్తారని ఆశిస్తున్నా- రాథోడ్ బాపురావు
”ఆదిలాబాద్ లో ముగ్గురు ట్రైబల్ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకపోవడం పట్ల బాధపడ్డా. దేశ అభివృద్ధి కోసం మోడీతో కలిసి పని చేద్దామని బీజేపీలో చేరా. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం వాటా నిధులు వస్తున్నాయి. సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఇవ్వడం సంతోషకరం. ఆదిలాబాద్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. ఆదిలాబాద్ బోథ్ స్థానంలో పోటీ చేస్తున్న సోయం బాపురావును భారీ మెజారిటీతో గెలిపిస్తా. భవిష్యత్తులో ఆదిలాబాద్ ఎంపీ స్థానం నాకు ఇస్తారని భావిస్తున్నా” అని రాథోడ్ బాపురావు అన్నారు.

Also Read : రూ.70 గడియారం కావాలా..? ఆత్మగౌరవం కావాలా..? : సీఎం కేసీఆర్