Jeevan Reddy : బెల్ట్ షాపులను రద్దు చేయాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఉచిత బస్సుల కంటే బెల్ట్ షాపుల రద్దుతోనే మహిళలు ఎక్కువగా సంతోషిస్తారని తెలిపారు.

jeevan reddy
MLC Jeevan Reddy : రాష్ట్రంలో బెల్ట్ షాపులను రద్దు చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బెల్ట్ షాపుల వల్ల పేదలు రోడ్డున పడ్డారని తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం కరీంనగర్ లో మీడియాలో మాట్లాడారు. అక్రమ మద్యం దుకాణాలపై కేసులు పెట్టాలని పేర్కొన్నారు. ఉచిత బస్సుల కంటే బెల్ట్ షాపుల రద్దుతోనే మహిళలు ఎక్కువగా సంతోషిస్తారని తెలిపారు. కేసీఆర్ పాలనలో సమాజం చిన్నాభిన్నమైందని విమర్శించారు.