హైదరాబాద్‌లో అత్యంత చల్లనైన ప్రదేశంగా BHEL

హైదరాబాద్‌లో అత్యంత చల్లనైన ప్రదేశంగా BHEL

Updated On : November 11, 2020 / 7:47 PM IST

జనావాసాలు వేగంగా పెరుగుతున్న BHEL.. హైదరాబాద్ లోనే అత్యంత కూల్ ప్రాంతంగా నమోదైంది. సిటీలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు అంటున్నారు. మంగళవారం ఉదయం 8గంటల 30నిమిషాలకు బీహెచ్ఈఎల్‌లో ఉష్ణోగ్రతలు 10.2డిగ్రీల సెల్సియస్ గా ఉన్నాయి.

ప్రత్యేకించి రాత్రి సమయాల్లో మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) సమాచారం మేరకు.. నాలుగు రోజులుగా టెంపరేచర్ ఐదు డిగ్రీల వరకూ పడిపోయింది.



నవంబర్ 8న 16.9 డిగ్రీల సెల్సియస్ ఉన్న టెంపరేచర్.. నవంబర్ 11నాటికి 10.5డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది. బీహెచ్ఈఎల్ కు అతి దగ్గరగా ఉన్న శేరిలింగంపల్లిలోనూ అదే పరిస్థితి. 11.3డిగ్రీల సెల్సియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు.

రాబోయే రోజుల్లో బీహెచ్ఈఎల్ పరిసర ప్రాంతాల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు వెళ్తాయనుకోవడంలోనూ ఆశ్చర్యం లేదంటున్నారు అధికారులు. రెండేళ్ల క్రితం బీహెచ్ఈఎల్ లో రాత్రి ఉష్ణోగ్రతలు 6.6డిగ్రీల సెల్సియస్ గా నమోదైనట్లు రికార్డులు ఉన్నాయి. గతేడాది 12డిగ్రీల సెల్సియస్ నుంచి 15డిగ్రీల సెల్సియస్ మధ్యలో నడిచింది.

భారత వాతవరణ శాఖ రికార్డుల ప్రకారం.. హైదరాబాద్ కనీస ఉష్ణోగ్రత 12.8 డిగ్రీల సెల్సియస్ గా ఉండాలి. అంటే సాధారణ టెంపరేచర్ కంటే 6డిగ్రీలు తక్కువగానే ఉంది ప్రస్తుత టెంపరేచర్. మూడు రోజులుగా కనీస ఉష్ణోగ్రత ఐదు డిగ్రీలు పడిపోయింది. అంటే 17.8డిగ్రీల నుంచి 12.8డిగ్రీల సెల్సియస్‌కు.

గడిచిన 24గంటల్లో సంగారెడ్డిలో కనీస ఉష్ణోగ్రతలు 7.1డిగ్రీల సెల్సియస్ గా మాత్రమే రికార్డ్ అయ్యాయి. వికారాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, రాజన్న సిరిసిల్లల్లో ఏడు డిగ్రీల సెల్సియస్ నుంచి 9డిగ్రీల సెల్సియస్ మధ్య మాత్రమే ఉంటున్నాయి ఉష్ణోగ్రతలు.

టీఎస్‌డీపీఎస్ వాతావరణ అంచనా ప్రకారం.. రానున్న రెండ్రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30-32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండగా.. కనీస ఉష్ణోగ్రతలు 15-18 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది.