Gachibowli Road Accident : గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైనుంచి కిందపడి వాహనదారుడి మృతి

బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం అతడిని ఆస్పత్రికి తరలించారు.

Gachibowli Road Accident : గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైనుంచి కిందపడి వాహనదారుడి మృతి

Gachibowli Road Accident

Updated On : July 24, 2023 / 8:21 AM IST

Biker Died :హైదరాబాద్ లో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైనుంచి కింద పడి వాహనదారుడి మృతి చెందారు. బైక్ పై అతివేగంగా ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు డివైడర్ ను ఢీకొట్టడంతో ఫ్లైఓవర్ పైనుంచి కింద పడ్డారు.

బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం అతడిని ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతుడు గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న మధు (25)గా గుర్తించారు.

Road Accident One Died : హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.