ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బీజేపీ కార్యకర్త మృతి

  • Published By: bheemraj ,Published On : November 6, 2020 / 12:50 AM IST
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బీజేపీ కార్యకర్త మృతి

Updated On : November 6, 2020 / 7:08 AM IST

BJP activist kill : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బీజేపీ కార్యకర్త గంగుల శ్రీనివాస్‌ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలానిగూడెంకు చెందిన శ్రీనివాస్ నవంబర్‌ 1న బీజేపీ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స కోసం అతన్ని నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.



44 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరగా.. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే గురువారం (నవంబర్ 5, 2020) మధ్యాహ్నం ఆయన మృతి చెందాడు. దీంతో ఆస్పత్రి వద్ద బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.



తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు శ్రీ @bandisanjay_bjp గారి అరెస్టుకు నిరసనగా కార్యకర్త గంగుల శ్రీనివాస్ ఒంటికి నిప్పంటించుకొని యశోధలో చికిత్స పొందుతూ మరణించడం బాధాకరం, తన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఇలాంటి క్షణికావేశ పనులకు పాల్పడవద్దని అందరిని వేడుకుంటున్నాను. pic.twitter.com/FyoldOz2Tp
— S. Vishnu Vardhan Reddy (@SVishnuReddy) November 5, 2020