MLC Elections: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం.. అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో..

MLC Elections: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం.. అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

Anji Reddy

Updated On : March 6, 2025 / 10:19 AM IST

MLC Elections: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి నల్గొండ – వరంగల్ – ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించగా.. ఉమ్మడి కరీంనగర్ – నిజామాబాద్ -అదిలాబాద్ -మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థి మల్క కొమరయ్య విజయం సాధించారు. ఈ రెండు చోట్లా సిటింగ్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.

Also Read: Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. డేట్ ఫిక్స్

మరోవైపు ఉమ్మడి కరీంనగర్ – అదిలాబాద్ – నిజామాబాద్ – మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన నరేంద్ర్ రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యాక బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 75,675 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 70,565 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థికి 60,419 ఓట్లు వచ్చాయి. ఏ అభ్యర్థికీ గెలుపు టార్గెట్ కోటా అయిన 1,11,672 ఓట్లు రాలేదు. మిగిలిన 53 మంది కలిపి 16,684 ఓట్లు పోలయ్యాయి. రెండో ప్రాధాన్యత ద్వారా బీజేపీ అభ్యర్థికి 98,637 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థికి 93,531 ఓట్లు పోలయ్యాయి. దీంతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 5,106 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Also Read: Gold: బంగారంకు ఎందుకంత డిమాండ్.. పసిడిపై పెట్టుబడి పెడితే కాసుల వర్షం కురిపిస్తోందా.. సెంట్రల్ బ్యాంక్‌లు ఏం చేస్తున్నాయో తెలుసా..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన మల్క కొమరయ్య, అంజిరెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘బీజేపీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు. కొత్తగా ఎన్నికైన మా అభ్యర్థులకు అభినందనలు. ప్రజల మధ్య ఉంటూ ప్రజలకోసం పనిచేస్తున్న బీజేపీ కార్యకర్తలను చూసి నేను చాలా గర్వపడుతున్నా.’’ అంటూ మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.