JP Nadda To Meet Actor Nithin : నిన్న జూ.ఎన్టీఆర్‌, నేడు నితిన్‌.. తెలుగు హీరోలపై కన్నేసిన బీజేపీ హైకమాండ్.. నడ్డాతో భేటీ కానున్న నితిన్

తెలుగు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న బీజేపీ.. తెలుగు హీరోలపై కన్నేసిందా? టాలీవుడ్ హీరోలను తమవైపు తిప్పుకునే పనిలో కమలదళం ఉందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలు తలెత్తక మానవు.

JP Nadda To Meet Actor Nithin : నిన్న జూ.ఎన్టీఆర్‌, నేడు నితిన్‌.. తెలుగు హీరోలపై కన్నేసిన బీజేపీ హైకమాండ్.. నడ్డాతో భేటీ కానున్న నితిన్

Updated On : August 26, 2022 / 10:57 PM IST

JP Nadda To Meet Hero Nithin : తెలుగు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న బీజేపీ.. తెలుగు హీరోలపై కన్నేసిందా? టాలీవుడ్ హీరోలను తమవైపు తిప్పుకునే పనిలో కమలదళం ఉందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలు తలెత్తక మానవు. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కావడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మరో బీజేపీ అగ్రనేత మరో టాలీవుడ్ హీరోతో భేటీ కానున్నారు.

శనివారం తెలంగాణకు రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తో భేటీ కానున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో నితిన్ తో జేపీ నడ్డా భేటీ కానున్నారు. హన్మకొండలో ఆర్ట్స్ కాలేజీలో జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొనేందుకు జేపీ నడ్డా వస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు వరుసగా తెలుగు హీరోలను కలవనుండటం ఇప్పుడు తెలంగాణ అంతటా హాట్ టాపిక్ గా మారింది.

Amit Shah Meets Jr NTR : అమిత్ షాతో ముగిసిన జూ.ఎన్టీఆర్ భేటీ.. ఏం చర్చించుకున్నారంటే..

నిన్న జూనియర్ ఎన్టీఆర్, నేడు నితిన్.. బీజేపీ అగ్రనేతలు తెలుగు హీరోలను కలవనుండటం వెనుక కమలనాథుల ఎన్నికల స్ట్రాటజీ ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలుగు హీరోలను స్టార్ క్యాంపెయినర్లుగా వాడుకునే ఆలోచనలో బీజేపీ ఉందనే విశ్లేషణ వినిపిస్తోంది. కాగా, నటుడు నితిన్ బీజేపీలో చేరనున్నారని సమాచారం. ఈ క్రమంలోనే నితిన్ జేపీ నడ్డాతో భేటీ కానున్నారని తెలుస్తోంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw