Eleti Maheshwar Reddy : కుమ్మక్కైన కాంగ్రెస్, బీఆర్ఎస్ : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
బీఆర్ఎస్ , కాంగ్రెస్ కలిసి పని చేయడాన్ని వ్యతిరేకించానని చెప్పారు. బీఆర్ఎస్ ను గద్దే దించడం కేవలం బీజేపీ, నరేంద్ర మోదీతోనే సాధ్యం అన్నారు.

Eleti Maheshwar Reddy
Eleti Maheshwar Reddy : కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాణానికి రెండు వైపులా ఉంటాయని తెలిపారు. ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. నిర్మల్ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్.. బీఅర్ఎస్ తో పోరాడుతుందనే నమ్మకం లేదన్నారు. కాంగ్రెస్ లో గౌరవం లేకున్నా పనిచేశానని.. నిరంతరం మథనపడినానని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ , కాంగ్రెస్ కలిసి పని చేయడాన్ని వ్యతిరేకించానని చెప్పారు. బీఆర్ఎస్ ను గద్దే దించడం కేవలం బీజేపీ, నరేంద్ర మోదీతోనే సాధ్యం అన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని ఒడించాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. షోకాజ్ నోటిస్ ఇచ్చి తనను కాంగ్రెస్ అవమానించిందని.. అందుకే పార్టీ నుండి వైదోలిగినానని స్పష్టం చేశారు. నిర్మల్ లో కాషాయ జెండా ఎగురవేస్తామని చెప్పారు.
Bandi Sanjay : కేసీఆర్… నీ మాటలన్నీ కోతలే : బండి సంజయ్
ఎలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారిగా నిర్మల్ లో పర్యటిస్తున్నారు. నిర్మల్ కు చేరుకున్నారు. ఆయనకు నాయకులు ఘనస్వాగతం పలికారు. సెంటి థామస్ స్కూల్ నుండి మహేశ్వర్ రెడ్డి ఇంటి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు.