Kishan Reddy : బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి రైతు దీక్ష.. ప్రధాన డిమాండ్స్ ఇవే..

రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కిషన్ రెడ్డి దీక్షలో కూర్చోనున్నారు.

Kishan Reddy : బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి రైతు దీక్ష.. ప్రధాన డిమాండ్స్ ఇవే..

kishan Reddy

Updated On : April 15, 2024 / 12:43 PM IST

Kishan Reddy Rythu Deeksha : లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పీడ్ పెంచింది. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీని నిలదీస్తుంది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతో రైతు దీక్ష చేపట్టారు. రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కిషన్ రెడ్డి దీక్షలో కూర్చోనున్నారు. రైతులకు పంట నష్ట పరిహారంతో పాటు, రైతు రుణమాఫీ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.

Also Read : ఆ మెసేజ్‌ను బయటపెట్టి మా నాన్న నా పరువు తీశారు: కేకే కుమారుడు విప్లవ్

ప్రధాన డిమాండ్స్ ఇవే..
వడ్లకు క్వింటాల్ రూ.500 బోనస్ వెంటనే అమలు చేయాలి.
రెండు లక్షలలోపు బ్యాంకు రుణాలను మాఫీ చేయాలి.
కరువు వలన నష్టపోయిన రైతులకు రూ. 25వేల నష్టపరిహారాన్ని అందించాలి.
రైతు కూలీలకు రూ.12000 బ్యాంక్ అంకౌట్ లో జమ చేయాలి.
రైతు భరోసా ద్వారా 15వేల రూపాయలను రైతులకు అందించాలి.