Alleti Maheshwar Reddy: ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టి సంక్షేమ పథకాలు ఎగ్గొట్టే ప్రయత్నం, మంత్రివర్గ విస్తరణ ఇష్టం లేదు- సీఎం రేవంత్ పై ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఈ విషయాన్ని మంత్రులు విభేదిస్తున్నారని చెప్పారు. మంత్రి మండలి రెండుగా చీలిపోయిందని సంచలన కామెంట్స్ చేశారు.

Alleti Maheshwar Reddy: ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టి సంక్షేమ పథకాలు ఎగ్గొట్టే ప్రయత్నం, మంత్రివర్గ విస్తరణ ఇష్టం లేదు- సీఎం రేవంత్ పై ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Updated On : May 16, 2025 / 4:38 PM IST

Alleti Maheshwar Reddy: తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదని ఆయన అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని సీఎం రేవంత్ అన్నారని.. మరి ఆర్ధికశాఖ చూసే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎందుకు మాట్లాడం లేదని ఆయన ప్రశ్నించారు. భట్టినే కాదు క్యాబినెట్ మంత్రులు ఎవరూ ఆర్ధిక పరిస్థితులపై మాట్లాడం లేదని గుర్తు చేశారు.

ఈ విషయంలో మంత్రుల మధ్యలో విభేదాలు వచ్చాయని, సీఎం రేవంత్ ని మంత్రులు విభేదిస్తున్నారని వ్యాఖ్యానించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉచితాలు వద్దని అంటున్నారు, ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టి సంక్షేమ పథకాలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని మంత్రులు విభేదిస్తున్నారని చెప్పారు. మంత్రి మండలి రెండుగా చీలిపోయిందని సంచలన కామెంట్స్ చేశారు.

”సీఎంను వ్యతిరేకించే మంత్రులు రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీకి నివేదికలు ఇస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాలేదని పదే పదే మాట్లాడుతూ రాష్ట్రాన్ని, కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారు. ఆర్థిక ఎమర్జెన్సీ విషయంలో సీఎంకు, మంత్రులకు విభేదాలు వస్తున్నాయి. రామకృష్ణరావును సీఎస్ గా పెట్టింది ఆర్ధిక ఎమర్జెన్సీ పెట్టేందుకే. రామకృష్ణరావు తనకున్న అనుభవంతో ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.

కడుపు కట్టుకుంటే 40వేల కోట్లు వస్తాయని చెప్పిన రేవంత్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారా అని మంత్రులు అనుకున్నారు. మంత్రుల శాఖలో సీఎం జోక్యంతో మంత్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి వద్ద సీఎం సమీక్షలతో మంత్రులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం మమ్మల్ని కలుపుకపోవడం లేదని ఉత్తమ్, భట్టి లాంటి వారు వాపోతున్నారు. భూముల అన్యాక్రాంతంతో కూడా మంత్రుల మధ్య విబేధాలు వస్తున్నాయి. ఉన్న మంత్రివర్గంలోనే సీఎం వ్యతిరేకుల ఎక్కువగా ఉన్నారు.

మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆ సంఖ్య ఎక్కువయ్యే అవకాశం ఉందని రేవంత్ రెడ్డినే మంత్రివర్గ విస్తరణ అపుతున్నారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రి లేడని జానారెడ్డితో లేఖ రాపిస్తారు. దళితుల నుండి రెప్రజెంటేషన్ తీసుకుంటారు. మంత్రివర్గ విస్తరణ ఇష్టం లేకనే ఇలా చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ అయితే తన వద్ద ఉన్న శాఖలు పోతాయని భయపడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ అడ్డుకుంటున్న సూత్రధారి, పాత్రధారి రేవంత్ రెడ్డినే. ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టారు. మంత్రివర్గ విస్తరణ జరిగితే బీసీలకు 42 శాతం ఇవ్వాల్సి వస్తుందని మంత్రులకు చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో దామోదరకు డిప్యూటీ సీఎం, పొన్నంకు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సి వస్తుందని.. వారికి డిప్యూటీ సీఎంలు వస్తే తన ఆటలు సాగవని భయపడుతున్నారు.

Also Read: ఫ్యూచర్ సీటీలో పూర్తిస్థాయిలో భూగర్భ విద్యుత్ లైన్లు.. విద్యుత్ టవర్లు, పోల్స్ బయటికి కనపడొద్దు.. ఇలా చేయండి: రేవంత్‌ ఆదేశం

ఏడాదిన్నర కాలంగా మంత్రివర్గ విస్తరణ జరగకుండా అడ్డుపడుతున్నారు. మంత్రివర్గంలో బీసీలకు పనికిమాలిన శాఖలు ఇచ్చి బీసీలకు న్యాయం చేస్తున్నాం అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తోడు హైకమాండ్ కూడా అవకాశం కోసం ఎదురుచూస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అనేక రిపోర్టులు రాహుల్ గాంధీ వద్ద ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికల తర్వాత ఒక ఆలోచనతో ముందుకెళ్తారు. మొత్తం మీరు దోచుకొని మాకు టిప్పు ఇస్తే ఎలా అని ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన మంత్రులకు లోకల్ బాడీ ఎన్నికల వరకు ఆగాలని చెప్పినట్లు సమాచారం. దీంతో వారు కుడా లోకల్ బాడీ ఎన్నికల వరకు ఆగుతున్నారు. కాంగ్రెస్ ను మరో పదేళ్ల వరకు లేవకుండా చేస్తున్నారని ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అంటున్నారని” మహేశ్వర్ రెడ్డి అన్నారు.