ఓవైసీ బ్రదర్స్ బెదిరింపులతోనే హైడ్రా కోరలు పీకారు.. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : మహేశ్వర్ రెడ్డి

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చిన మీరు హైకోర్టు తీర్పు ఉల్లంగించినట్లే. పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్ష నేతలకు ఇవ్వడం ఆనవాయితీ.

ఓవైసీ బ్రదర్స్ బెదిరింపులతోనే హైడ్రా కోరలు పీకారు.. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : మహేశ్వర్ రెడ్డి

BJP MLA Alleti Maheshwar Reddy

BJP MLA Alleti Maheshwar Reddy : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పును బీజేపీ స్వాగతిస్తుందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్వాగతించిన నేపథ్యంలో సీఎంకు, ఏఐసీసీ అధ్యక్షుడికికూడా చర్యలు తీసుకోవాలని చెప్పాలని మహేశ్వర్ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎత్తుకుపోయినప్పుడు ఆ చర్యలు కాంగ్రెస్ నేతలు ఖండించారు. మేనిఫెస్టోకు కట్టుబడి లేకుండా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. ఇందిరా కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు చేయకుండా ఆర్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉందని చెప్పదలచుకున్నారా? అంటూ మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశించిన ముగ్గురే కాదు.. పార్టీ మారిన 10మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

Also Read : Godavari Floods : భద్రాచలం వద్ద గంటగంటకు పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చిన మీరు హైకోర్టు తీర్పు ఉల్లంగించినట్లే. పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్ష నేతలకు ఇవ్వడం ఆనవాయితీ. బీఆర్ఎస్ పంపిన పేర్లలో ఒకరిని కాకుండా మీ పార్టీలో చేరిన ఒక ఎమ్మెల్యేకు ఎలా పీఏసీ చైర్మన్ పదవి ఇస్తారని మహేశ్వర రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా చిచ్చు పెడతారని ఏఐసీసీ జాగ్రత్త పడుతుందని అన్నారు. మంత్రులు కేవలం వసూళ్ల కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేవలం ట్యాక్స్ వసూలు మీద దృష్టిసారించారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.

Also Read : Amaravath : అమరావతిలో ఉద్రిక్తత.. వైసీపీ నేతల కార్లను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు.. ఇరువర్గాల మధ్య ఘర్షణ

హైడ్రా ఆరంభశూరత్వం అవుతుందని నేను ముందే చెప్పాను. హైడ్రా పేరుతో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. హైడ్రాను ఎందుకు ఒక డమ్మీగా మార్చారని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఓవైసీ బ్రదర్స్ బెదిరింపులతోనే హైడ్రా కోరలు పీకారు. ఈ రాష్ట్రానికి ప్రభుత్వం తీరని నష్టం చేస్తుంది. రేవంత్ రెడ్డి సీఎంగా ఒక ఏడాది పూర్తిచేస్తానా అనే భయంతో ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో మంత్రులు, సీఎంకు.. ఏఐసీసీకి రేవంత్ రెడ్డికి గ్యాప్ ఉంది. అన్ని అంశాలపై బీజేపీ ముందుగానే స్పందించింది. సోషల్ మీడియాతోనే రేవంత్ రెడ్డి ఈ స్థాయికి వచ్చారు. జర్నలిస్టులు ఎవరైనా వారికి గౌరవం ఇవ్వాల్సిందేనని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు.