Raghunadan Rao: రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ పిచ్చి ప్రేలాపనలు: రఘునందన్ రావు

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలసి పోటీచేయబోతున్నాయని ఆరోపించిన రఘునందన్ రావు..తన సొంత కుటుంబ సభ్యులను నమ్మలేని స్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని అన్నారు.

Raghunadan Rao: రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ పిచ్చి ప్రేలాపనలు: రఘునందన్ రావు

Raghunanada

Updated On : February 13, 2022 / 2:47 PM IST

Raghunadan Rao: 2024 ఎన్నికల్లో పొత్తుల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ పాకులాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని..ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కలవకుండా కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని రఘునందన్ రావు అన్నారు. రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ కంటే ఎక్కువగా సీఎం కేసీఆర్ సానుభూతి చూపించారని ఎద్దేవా చేశారు. సోనియా, చంద్రబాబులు.. మోదీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కేసీఆర్ కళ్ళల్లో నీళ్ళు ఎందుకు రాలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు.

Also read: Botsa Satyanarayana: ప్రత్యేక హోదా సాదించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుంది

ఇతర నేతల భాష గురించి కేసీఆర్ మాట్లాడటం..దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలసి పోటీచేయబోతున్నాయని ఆరోపించిన రఘునందన్ రావు..తన సొంత కుటుంబ సభ్యులను నమ్మలేని స్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని అన్నారు. బైంసాలో హిందువులపై దాడులు జరిగితే మాట్లాడని కేసీఆర్.. మత రాజకీయాలు గురించి మాట్లాడటం సిగ్గుచేటని, పాతబస్తీలో హిందూ సమాజానికి జరిగిన నష్టంపై కేసీఆర్ తో చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందని రఘునాధన్ రావు సవాల్ విసిరారు.

Also read: Meru International School: ‘మేరు’ ఇంటర్నేషనల్ స్కూల్‌కి దేశంలోనే అత్యుత్తమ అవార్డు