MLA Raja Singh : క్రైమ్ చేస్తా.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను క్రైమ్ చేయకుండా చూస్కోవాల్సిన బాధ్యత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దే అని చెప్పారు.

MLA Raja Singh : క్రైమ్ చేస్తా.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

Bjp Mla Rajasingh Sensational Comments

Updated On : June 7, 2021 / 12:48 PM IST

MLA Raja Singh : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను క్రైమ్ చేయకుండా చూస్కోవాల్సిన బాధ్యత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దే అని చెప్పారు. కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో హిందువుల దేవతలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని రాజాసింగ్ మండిపడ్డారు.

దీనిపై ఆయన హైదరాబాద్ సీపీకి లేఖ రాశారు. ఆ పోస్టులు పెట్టిన వారి మీద 24గంటల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీరు చర్యలు తీసుకోకపోతే మా దగ్గర వారి అడ్రస్ లు ఉన్నాయి, నేను క్రైమ్ చేస్తానని హెచ్చరించారు. ఇప్పటికే తన మీద అనేక అక్రమ కేసులు ఉన్నాయన్న రాజాసింగ్, మళ్లీ ఒక కేసు అవుతుంది కావచ్చు అన్నారు.