Bandi Sanjay: తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు.. పెద్దపల్లి గ్యాంగ్ రేప్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
నాయకులను ఇతర పార్టీలోకి పోకుండా కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ముందుగా అభ్యర్థుల ప్రకటన డ్రామా చేస్తున్నారని సంజయ్ అన్నారు.

Bandi Sanjay
TS BJP Leader Bandi Sanjay: పెద్దపల్లి జిల్లాలో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. బాలికది గ్యాంగ్ రేప్ కాదని, ఆత్మహత్య అని తేల్చారు. ఈ ఘటనపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ స్పందిస్తూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది, పాప చనిపోయింది. పోలీసులే రేపు అన్నారు.. ఇప్పుడు అమ్మాయిది ఆత్మహత్య అంటున్నారు. నిందితులను తప్పించేందుకు పోలీసులు ప్రభుత్వంలోని వారు ప్రయత్నిస్తున్నారని సంజయ్ ఆరోపించారు. పెద్దపల్లి బాలిక గ్యాంగ్ రేప్ ఘటన దిశ కేసు కంటే దారుణంగా జరిగిందని అన్నారు. పెద్దపల్లిలో ఓ రియల్టర్, హైదరాబాద్‌కి చెందిన ఓ నాయకుడు కలిసి ఒత్తిడి తేవడంతో ఓ మంత్రి, CMO నుంచి వచ్చిన ఆదేశాలతో కేసును చిన్నదిగా చేస్తున్నారని సంజయ్ అన్నారు.
MLA Vallabhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తప్పిన ప్రమాదం
ప్రభుత్వంలోని పెద్దలు బరితెగించి దుండగులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అమ్మాయి కుటుంబ సభ్యులను బెదిరించి స్టేట్మెంట్ ఇప్పించే ఒత్తిడి జరుగుతుందని అన్నారు. నేను మధ్యప్రదేశ్ సీఎంతో మాట్లాడతా, అసలు నిజాలు బయటికి వస్తాయి.. పోలీస్ అధికారి బలికాక తప్పదు అంటూ బండి సంజయ్ హెచ్చరించారు. పెద్దపల్లి గ్యాంగ్ రేప్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
నాయకులను ఇతర పార్టీలోకి పోకుండా కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ముందుగా అభ్యర్థుల ప్రకటన డ్రామా చేస్తున్నారని సంజయ్ అన్నారు. నవంబర్ దాకా గడువు ఉన్నప్పటికీ మద్యం టెండర్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. సీఎం మాటలు నమ్మొద్దు ప్రజలారా.. ఈ మూడు నెలలు మోసం చేసేందుకు నమ్మించే ప్రయత్నం చేస్తారు అంటూ సంజయ్ సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకివస్తే ఈ అప్పులపాలైన రాష్ట్రాన్ని బాగు చేసేందుకు నిధులు ఎలా తెస్తదని బండి సంజయ్ ప్రశ్నించారు. మురళీధర్ రావు వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా.. మురళీధర్ రావు వ్యాఖ్యలను నేను చూడలేదు, ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని నిర్ణయం ఏమి జరగలేదని బండి సంజయ్ అన్నారు.