BJP MP Laxman : తెలంగాణలో జనసేనతో కలిసి పోటీ చేసే విషయంలో లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఎన్డీయేతో పొత్తులో ఉన్న జనసేన తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తుందా..?కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీకి ప్రాధాన్యత సంతరించుకున్న క్రమంలో తాజాగా జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలో అనే విషయంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Janasena PawanKalyan
Janasena In Telangana Elections : ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్న జనసేన పార్టీ తెలంగాణలో కూడా పోటీకి సై అంటోంది. దీంట్లో భాగంగా జనసేన తెలంగాణలోఎవరితో పొత్తు పెట్టుకుంటుంది..? ఒంటిరిగానే బరిలోకి దిగుతుందా..?అనే విషయం ఆసక్తికరంగా మారిన క్రమంలో తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎన్డీయేతో పొత్తులో ఉన్న జనసేన తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తుందనే వార్తలు వచ్చిన క్రమంలో ఇది నిజమే అనేలా గత బుధవారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ లు పవన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని పవన్ ను కోరారు. పవన్ కూడా జనసేనకు 30 సీట్లు అయినా ఇవ్వాలని కోరినట్లుగా సమాచారం.
ఈ విషయంపై తాజాగా తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతు.. తెలంగాణలో జనసేనకు ఇచ్చే సీట్లపై కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. జనసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని జనసేనకు మాతో కలిసి పోటీ చేయాలని భావిస్తోందని అన్నారు. తెలంగాణలో బీజేపీ,జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వెల్లడించారు.
కాగా జనసేనకు టీబీజేపీ 10 నుంచి 12 సీట్లు ఇచ్చే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఆయా పార్టీ నేతలు కలిసి మరింత చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తొలి విడత జాబితాలో 55 సీట్లకు అభ్యర్ధుల్ని ఖరారు చేసింది. బీజేపీ. ఈ లిస్టులో తొలి జాబితాలో బండి సంజయ్,ఈటల రాజేందర్,డీకే అరుణ,రాణి రుద్రమ, వివాదాలల్లో చిక్కుకుని పార్టీ సస్పెండ్ కు గురైన రాజాసింగ్ పేర్లు ఉన్నాయి. రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తు సిట్టింగ్ సీటునే బీజేపీ అధిష్టానం కేటాయించింది. అలాగే ఖమ్మంలో8,నల్లగొండలో 2,హైదరాబాద్ లో ఒకటి, వరంగల్ లో ఒకటి జనసేనకు ఇవ్వాలని టీ.బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.