అమ్ముడుపోనిది మా ఎమ్మెల్యేలు మాత్రమే, మాకే ఓటేయండి.. దుబ్బాకలో బీజేపీ ఎన్నికల ప్రచారం

  • Published By: naveen ,Published On : October 30, 2020 / 12:27 PM IST
అమ్ముడుపోనిది మా ఎమ్మెల్యేలు మాత్రమే, మాకే ఓటేయండి.. దుబ్బాకలో బీజేపీ ఎన్నికల ప్రచారం

Updated On : October 30, 2020 / 12:56 PM IST

bjp raghunandan rao: దుబ్బాక ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీలు విస్తృతంగ ప్రచారం చేస్తున్నాయి. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మాటల యుద్ధానికి దిగుతున్నారు. తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. సిద్ధిపేట జిల్లా లచ్చపేటలో బీజేపీ నేతలు రఘునందన్ రావు, రాజాసింగ్ ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మండిపడ్డారు.

కారు, చేయి రెండూ ఒక్కటే అన్న ఆయన, వాళ్లకు ఓటేయొద్దని కోరారు. బీజేపీ తప్ప అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అమ్ముడుపోతారని అన్నారు. దుబ్బాకలో జరిగేది ఎన్నికలు కాదు యుద్ధం అని బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బంగారు తెలంగాణ కాలేదు కానీ మత్తు తెలంగాణ అయ్యిందని విమర్శించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుని అసెంబ్లీకి పంపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడని రాజాసింగ్ చెప్పారు.