BJP MLC Candidates : బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే..
ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో బీజేపీ దూకుడు ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు.

BJP MLC Candidates : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డిని ఎంపిక చేసింది బీజేపీ. కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్యను బరిలోకి దింపుతోంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తమ్ రెడ్డి పేరును బీజేపీ ఖరారు చేసింది.
మిగతా పార్టీల కంటే ముందే అభ్యర్థుల ప్రకటన..
ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో బీజేపీ దూకుడు ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు. మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ముందు నిలిచిందని చెప్పుకోవచ్చు. ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఏ ఎన్నికలు వచ్చినా అందులో పోటీ చేయాలని, సత్తా చాటాలని భావిస్తోంది.
Also Read : ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను సర్కారు స్వాధీనం చేసుకుంటుంది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిని, 2 టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించేసింది. మిగతా పార్టీలకంటే ముందే అభ్యర్థులను ప్రకటించేసి పైచేయి సాధించవచ్చన్న అంచనాతో బీజేపీ ఉంది.
అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలు పాటించిన బీజేపీ..
అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలను బీజేపీ పాటించినట్లుగా చూడొచ్చు. రెడ్డి సామాజికవర్గానికి రెండు స్థానాలు కేటాయించగా.. ఒక బీసీకి సీటు ఇచ్చిన పరిస్థితి ఉంది. రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకుగాను.. ఒక స్థానాన్ని బీసీలకు, మరొక స్థానాన్ని రెడ్డి సామాజికవర్గానికి కేటాయించింది. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ పెద్దలు సోషల్ ఇంజినీరింగ్ ఫాలో అయినట్లు తెలుస్తుంది.
మూడింటిలో రెండు చోట్ల గెలుపే లక్ష్యం..
ఈ మూడు స్థానాల్లో సత్తా చాటాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మూడింటిలో కనీసం రెండు స్థానాల్లో బీజేపీ జెండా ఎగరేయాలని పట్టుదలగా ఉంది. గెలుపు సాధించడం ద్వారా ప్రజల్లో వెళ్లే అవకాశం ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. గ్రాడ్యుయేట్ల పట్ల గత ప్రభుత్వం చేసిన విధానాలు, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ప్లాన్ చేసింది. అలాగే, టీచర్స్ పక్షాన పోరాడాలని నిర్ణయించుకుంది.
టీచర్లు, గ్రాడ్యుయేట్ల ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం..
గతంలో టీచర్స్ ఎమ్మెల్సీగా ఏవీఎన్ రెడ్డిని గెలిపించుకుంది బీజేపీ. ముఖ్యంగా 317 జీవోకు సంబంధించి టీచర్స్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వారి పక్షాన పోరాడటం ద్వారా టీచర్స్ ఎమ్మెల్సీ సీట్లను కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీ ఉంది. అదే విధంగా నిరుద్యోగుల పక్షాన ఇప్పటికే బీజేవైఎం నేతలు పోరాడుతున్నారు. తద్వారా గ్రాడ్యుయేట్ల ఓట్లను అట్రాక్ట్ చేయాలని బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
ఇందులో భాగంగానే ముందుగానే ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ద్వారా ఆయా వర్గాలకు చేరువ కావొచ్చనే ఆలోచనతో పార్టీ నేతలు ఉన్నారు. మరి, ఏ మేరకు బీజేపీ నాయకులు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారో చూడాలి.
Also Read : కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. ఏయే అంశాలపై చర్చించారంటే..