బొల్లారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు..కార్మికురాలు మృతి

బొల్లారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు..కార్మికురాలు మృతి

Updated On : February 21, 2021 / 9:39 PM IST

blast in Bollaram industrial : సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కార్మికురాలు మృతి చెందారు. పారిశ్రామికవాడలో ఉన్న ఎస్‌వైఎస్‌ ఎలక్ట్రానిక్‌ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాధిక అనే కార్మికురాలు మృతి చెందగా.. విజయ్‌కుమార్‌ యాదవ్‌, అన్వేశ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మరో ముగ్గురు కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. పరిశ్రమలోని కాయల్స్‌ వేడి చేసే బ్లాక్‌లో ఉష్ణోగ్రత పెరగడంతో ఒక్కసారిగా పేలుడు జరిగింది. గాయపడినవారిని బాచుపల్లిలోని మమత ఆస్పత్రికి తరలిచారు. ఈ పేలుడు ధాటికి పరిశ్రమలోని గోడలు బీటలు వారగా… పైకప్పు ఎగిరిపోయినట్లు కార్మికులు తెలిపారు.