Hyderabad : తీరు మార్చుకోని మందుబాబులు.. మద్యం మత్తుకు మరో ప్రాణం బలి

హయత్‌నగర్ మదర్ డైరీ వద్ద బైక్‌పై వెళ్తున్న రఘురామ్‌ను బొలెరో వాహనం ఢీకొట్టడంతో అతను చనిపోయాడు. మృతుడు కుంట్లూర్ కు చెందిన వాసిగా గుర్తించారు.

Hyderabad : తీరు మార్చుకోని మందుబాబులు.. మద్యం మత్తుకు మరో ప్రాణం బలి

Accident (1)

Updated On : April 25, 2022 / 11:51 AM IST

road accident : ఎన్నిసార్లు చెప్పినా దండగే..ఎలా చెప్పినా వేస్టే..! పీకలవరకు తాగడం.. ఇతరుల ప్రాణాలు తియ్యడం వీరికి బ్రాందీతో పెట్టిన విద్య. సిటీ సెంటర్‌ అయినా.. సిటీ శివారైన తాగి బండి నడపడం.. రోడ్డుపై వెళుతున్న వారిని ఢీకొట్టడం హైదరాబాద్‌లో నిత్యం కనిపిస్తోన్న దృశ్యాలు. మాదాపూర్‌లో తప్పతాగి కారు నడుపుతూ బైక్‌ను ఢీకొట్టి ముగ్గురికి గాయాలు చేసిన మందుబాబు ఘటన మరవకముందో నగరంలో మరో ఘటన జరిగింది. ఈసారి ఏకంగా ఓ వ్యక్తి ప్రాణాలు తీసేసింది.

హయత్‌నగర్ మదర్ డైరీ వద్ద బైక్‌పై వెళ్తున్న రఘురామ్‌ను బొలెరో వాహనం ఢీకొట్టడంతో అతను చనిపోయాడు. మృతుడు కుంట్లూర్ కు చెందిన వాసిగా గుర్తించారు. మృతుడు రఘురామ్ మెట్రో స్టేషన్లో విధులు ముగించుకుని కుంట్లర్‌లో ఉన్న తన ఇంటికి వెళుతుండగా.. బొలెరో వాహనం నడుపుతున్న ఓ తాగుబోతు అతని బైక్‌ను ఢీకొట్టాడు.

Car Accident : మద్యం మత్తులో యువకులు డ్రైవింగ్.. అపార్ట్‌మెంట్‌ను ఢీకొట్టిన కారు

దీంతో స్పాట్‌లోనే రఘురామ్‌ మృతి చెందాడు. మద్యం మత్తులో వాహనాన్ని నడిపి నిండు ప్రాణాన్ని బలిగొన్న బొలెరో డ్రైవర్ అంతటితో ఆగలేదు. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ ఓ ఇంటిలోకి దూసుకెళ్లాడు. బొలెరో కారు వేగానికి ఏకంగా ఆ ఇంటి ప్రహరీ గోడనే కూలిపోయిందంటే తాగుబోతు ఏ రేంజ్‌లో మద్యం సేవించాడో అర్థం చేసుకోవచ్చు.