Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు.. విమానాల్లో ముమ్మర తనిఖీలు

బుధవారం ఉదయం శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. విమానాశ్రయంలోని మూడు విమానాలకు

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు.. విమానాల్లో ముమ్మర తనిఖీలు

Bomb threat

Updated On : October 30, 2024 / 9:32 AM IST

Shamshabad Airport: కొత కొద్దిరోజులుగా విమానాలకు వరుస బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై కేంద్రం దృష్టిసారించింది. అయితే, తాజాగా బుధవారం ఉదయం శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. విమానాశ్రయంలోని మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాల్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేశారు. చెన్నై వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలకు, చెన్నై నుంచి వచ్చిన ఓ విమానంకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. వెంటనే విమానాశ్రయం సెక్యూరిటీ సిబ్బంది విమానాల్లో తనిఖీలు నిర్వహించారు.

 

వరుస బెదిరింపు కాల్స్ వ్యవహారాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఈ విషయంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ.. బాంబు బెదిరింపులపై లోతైన దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఇదిలాఉంటే.. విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ లో అప్రమత్తమైన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.