Sangareddy : నా ప్రాణం పోయినా పర్లేదు.. తిండితిప్పలు మాని చెట్టెక్కి నిరసన తెలిపిన బాలుడు
రోడ్లపై అడ్డం వచ్చిన చెట్లను అధికారులు నరికిస్తుంటే చూస్తూ పోయేవారే కానీ ఆపేవారు ఉండరు. కానీ ఓ బాలుడు మాత్రం చూస్తూ ఊరుకోలేదు. మరి ఏం చేశాడో చదవండి.

Sangareddy
Sangareddy : పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగంగా మొక్కలు నాటమని పిలుపునిస్తారు. కానీ అవే మొక్కల్ని నరికేస్తుంటే చూస్తూ ఊరుకుంటారు. కానీ ఓ బాలుడు మాత్రం చెట్లు నరకవద్దంటూ చెట్టెక్కి నిరసన తెలిపాడు. తన ప్రాణం పోయినా మొక్కలు నరకవద్దంటూ భీష్మించుకుని కూర్చున్న ఆ బాలుడిని అందరూ అభినందిస్తున్నారు.
Dilawar Khan : 65 ఏళ్ల వయస్సులో ఒకటవ తరగతిలో చేరిన వృద్ధుడు.. ఏజ్ జస్ట్ నంబర్ అంటున్న నెటిజన్లు
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం కాకతీయనగర్‌కి చెందిన అనిరుధ్ అనే 12 ఏళ్ల బాలుడు ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. ఈ బాలుడి ఉండే ప్రాంతంలో రోడ్డు వెడల్పు చేయడంలో భాగంగా కాంట్రాక్టర్ చెట్లు నరకడానికి వచ్చాడు. కొన్నిటిని నరికారు కూడా. ఇదంతా గమనించిన అనిరుధ్ వాళ్లు చేస్తున్న పనిని అడ్డుకున్నాడు. చెట్టెక్కి కూర్చుని నిరసన తెలిపాడు. 7 గంటలపాటు తిండి తిప్పలు మానేసాడు. తన ప్రాణాలు పోయినా పర్లేదు కానీ చెట్లు నరకమని అధికారులు ఆర్డర్ కాపీ ఇస్తేనే కిందకి దిగుతానని భీష్మించుకుని కూర్చున్నాడు.
Anand Mahindra : 97 ఏళ్ల బామ్మ సాహసం చూసారా? నా హీరో.. అంటూ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
అనిరుధ్ తండ్రి ప్రవీణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా, తల్లి టీచర్ గా పనిచేస్తున్నారు. అనిరుధ్ స్ధానిక నారాయణ స్కూల్లో 8 వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి మొక్కలు, జంతువుల పట్ల మక్కువ ఉన్న అనిరుధ్ పర్యావరణానికి ఎంతో మేలు చేసే మొక్కలు నరకవద్దని కోరుతున్నాడు. పర్యావరణాన్ని కాపాడటంలో తన వంతు బాధ్యతగా అనిరుధ్ చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు.