Brain Dead : బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవదానం.. ఎనిమిది మందికి ప్రాణం పోశారు
తీవ్రంగా గాయపడిన అతను అపస్మారకస్థితిలోకి వెళ్లారు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం అతన్ని హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు.

Brain Dead Person Give Organs
Brain Dead Person Give Organs : బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి ఎనిమిది మందికి ప్రాణం పోశారు. తన అవయవాలను దానం చేసి మరో ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన వైద్యుల రమేశ్ (45) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. రమేశ్ కు భార్య గాయత్రి, ఇద్దరు కూతర్లు వైష్ణవి, శర్వాణి ఉన్నారు. రమేశ్ గత నెల (ఆగస్టు) 25వ తేదీన ఇంట్లో కాలు జారి కింద పడిపోయారు.
తీవ్రంగా గాయపడిన అతను అపస్మారకస్థితిలోకి వెళ్లారు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం అతన్ని హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జీవన్ దాన్ అవయదాన కేంద్రం సభ్యులు అక్కడి వెళ్లి రమేశ్ భార్య, కూతుర్లకు తండ్రి అవయవదానానికి ఒప్పించారు.
Green Channel : అవయవదానం : మదురై నుంచి చెన్నైకి 76 నిమిషాల్లో ఊపిరి తిత్తులు
దీంతో రమేశ్ శరీరం నుంచి కండ్లు, కిడ్నీలు, కాలేయం, ఊపరితిత్తులు సేకరించి ప్రాణపాయ స్థితిలో ఉన్న వారికి శస్త్ర చికిత్స ద్వారా అమర్చినట్లు జీవన్ దాన్ ఇన్ చార్జ్ స్వర్ణలత పేర్కొన్నారు. ఈ మేరకు జీవన్ దాన్ అవయవదాన కేంద్రం తరపున శనివారం పెద్దపల్లిలో రమేశ్ కుటుంబ సభ్యులకు అవయవదాన సర్టిఫికేట్ అందజేసి, శాలువాతో వారిని సన్మానించారు.