Revanth Reddy: బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంకి కలిపి 36 సీట్లు వస్తాయి.. కాంగ్రెస్‌కేమో..: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌కు అనుకూలంగా సర్వేలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. అంతేగాక...

Revanth Reddy: బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంకి కలిపి 36 సీట్లు వస్తాయి.. కాంగ్రెస్‌కేమో..: రేవంత్ రెడ్డి

Revanth Reddy

Telangana elections-2023: తెలంగాణలో మరికొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంకి కలిపి 36 సీట్లు వస్తాయని చెప్పారు. తమ పార్టీ మిగతా అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపారు.

కాంగ్రెస్‌కు అనుకూలంగా సర్వేలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. సామాజిక వర్గాల నుంచి వస్తున్న అంశాలను పరిశీలించి టికెట్లు ఇస్తామని తెలిపారు. టికెట్లు దక్కని నేతలకు ఇతర పదవులు ఇచ్చి న్యాయం చేస్తామని వివరించారు. ఇన్నేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో పేరుతో ప్రజల ముందుకు వచ్చి ఏం చెప్పాలనుకుంటోందని నిలదీశారు.

మేనిఫెస్టో పేరుతో కొత్తగా అసత్యాలను ప్రకటించడానికి సిద్ధమవుతున్నట్లుందని విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో బీఆర్ఎస్ దోపిడీ చేసిందని అన్నారు. రూ.400 కోట్లతో సెక్రటేరియట్ నిర్మాణం అని చెప్పిన బీఆర్ఎస్ రూ.1,200 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.

కాగా, మరికొన్ని రోజుల్లో బీఆర్ఎస్, ఇతర పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించనున్నాయి. మేనిఫెస్టోలో బీఆర్ఎస్ అనేక కొత్త పథకాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి.

Kodali Nani : పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు