Balka Suman : చంద్రబాబు హయాంలో జరిగినట్లే రేవంత్ హయాంలోనూ జరుగుతుంది- బాల్క సుమన్

కాంగ్రెస్ పార్టీని హోల్ సేల్ గా మోదీ చేతిలో పెట్టేందుకు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మోదీకి వేసినట్లే..

Balka Suman : చంద్రబాబు హయాంలో జరిగినట్లే రేవంత్ హయాంలోనూ జరుగుతుంది- బాల్క సుమన్

Balka Suman On Chandrababu

Balka Suman : సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్. సీఎం రేవంత్ బీజేపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏక్ నాథ్ షిండే అవుతారని అన్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిల సమన్వయంతో ఎన్నో మున్సిపాలిటీలు దక్కించుకున్నారని ఆరోపణలు చేశారు.

”గురువు చంద్రబాబుతో రేవంత్ రెండు గంటలు మాట్లాడుకున్నారు. కాంగ్రెస్ మంత్రులు టీడీపీ కార్యాలయాలకు వెళ్లి థాంక్స్ చెప్పారు. బాబు ఆదేశిస్తే.. రేవంత్ పాటిస్తారు. బాబు హయాంలో కరవు ఎలా వచ్చిందో.. రేవంత్ హయాంలో కూడా అలాగే మారుతుంది. రేవంత్ నిజ స్వరూపం ఇప్పటికైనా తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీని హోల్ సేల్ గా మోదీ చేతిలో పెట్టేందుకు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఎప్పటికైనా అప్రమత్తంగా వ్యవహరించాలి.
ఎన్నికల తర్వాత ఏక్ నాథ్ షిండేలు వస్తారని బీజేపీ నేతలే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తే మోదీకి వేసినట్లే” అని బాల్క సుమన్ అన్నారు.

Also Read : తెలంగాణలో పోటీకి టీడీపీ, జనసేన దూరం.. ఢిల్లీ నుంచి కిషన్ రెడ్డికి పిలుపు