జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం.. కేటీఆర్ కీలక కామెంట్స్..

Jubilee Hills Bypoll Results : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఘన విజయం సాధించారు.

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం.. కేటీఆర్ కీలక కామెంట్స్..

KTR

Updated On : November 14, 2025 / 2:52 PM IST

Jubilee Hills Bypoll Results : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, BRS అభ్యర్థి మాగంటి సునీతపై 24వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి నవీన్‌ యాదవ్‌ ఆధిక్యం రౌండ్‌ రౌండ్‌కు పెరిగింది. మరోవైపు ఏ ఒక్క రౌండ్‌లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. అయితే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు.

ఉప ఎన్నిక ఫలితాన్ని స్వాగతిస్తున్నాం. బైపోల్స్ ఓటమితో కుంగిపోయేది లేదు. ప్రతిపక్షపాత్రగా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం. గులాబీ పార్టీ క్యాడర్‌కు నా ధన్యవాదాలు. మా అభ్యర్థి మాగంటి సునీత ధైర్యంగా కొట్లాడారు. బీఆర్ఎస్‌కు ఓటు వేసిన జూబ్లీహిల్స్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని కేటీఆర్ అన్నారు.

బైపోల్స్ లో నిజాయితీగా గెలవటానికే కొట్లాడినం. ఎన్నికల్లో ఆఖరి మూడు రోజుల్లో ఏం జరిగిందో ప్రజలకు తెలుసు. ఉప ఎన్నిక ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని ప్రజలు తీర్పునిచ్చారు. 2014నుంచి 2023వరకు జరిగిన ఏడు ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవలేదు. కానీ, 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వంలో ఉన్నవారు బూతులు మాట్లాడినా సంయమనం పాటించాం. అన్ని రకాల అక్రమాలకు అధికార కాంగ్రెస్ పార్టీ పాల్పడిందని కేటీఆర్ ఆన్నారు.

ఉప ఎన్నికల ఆర్ఎస్ బ్రదర్స్ మిత్రమండలి వర్కౌట్ అయింది. కాంగ్రెస్, బీజేపీలు ఎలా సహకరించుకున్నారో చూశాం. గులాబీ క్యాడర్ నిరాశ పడాల్సిన అవసరం లేదు. గోడకు కొట్టిన బంతి‌ లెక్క వెనక్కి వస్తాం. కాంగ్రెస్ పార్టీ బిహార్ లో ఉనికి కోల్పోయింది. తండ్రిని కోల్పోయి కూడా ఇంటి నుంచి పనిచేసిన హరీశ్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు. మా ఎమ్మెల్సీ రవీందర్ రావు సొంత అన్న చనిపోయినా బైపోల్స్ కోసం గట్టిగా పనిచేశారు.

బైపోల్స్ లో ఓటమిని సమీక్షించుకుంటాం. లిస్ట్‌లో ఉండి.. స్థానికంగా లేని ఓటర్లే జూబ్లీహిల్స్‌లో ఎక్కువగా ఉన్నారు. బైపోల్స్ లో డిపాజిట్ కోల్పోయిన పార్టీలు కూడా ఉన్నాయి. దొంగ ఓట్లను కట్టడి చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఏమీ చేయలేకపోయింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మార్చుకుంటుందో లేదో చూడాలి. శని, ఆదివారాల్లో హైడ్రా పేదల ఇళ్లు కూలగొట్టడం ఆపాలి.

పార్టీ ఫిరాయించిన బెంగాల్ ఎమ్మెల్యే ముకుల్ రాయ్‌ను హైకోర్టు డిస్ క్వాలిఫై చేసింది. తెలంగాణలో కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం. ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ రెడీగా ఉంది. ఒక ఉప ఎన్నికకే వెంటగిరి గల్లీల్లో తిరిగిన ముఖ్యమంత్రి.. పది ఉప ఎన్నికలు వస్తే ఎక్కడ తిరుగుతాడో చూద్దాం అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.