Prakash Goud: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ భేటీ
రేవంత్ రెడ్డిని ఇటీవలే మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం చర్చనీయాంశంగా మారింది.

Prakash Goud Meets Cm Revanth Reddy
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రకాశ్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. చాలాసేపు రేవంత్ రెడ్డితో ప్రకాశ్ గౌడ్ చర్చించారు. గత ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజక వర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ప్రకాశ్ గౌడ్ గెలిచిన విషయం తెలిసిందే.
రేవంత్ రెడ్డిని ఇటీవలే మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. మాణిక్ రావు (జహీరాబాద్), సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక), గూడెం మహిపాల్ రెడ్డి (పఠాన్ చెరు) ఇటీవల రేవంత్ రెడ్డితో చర్చించారు. మెదక్ జిల్లాకు సంబంధించిన అంశాలపై చర్చించామన్నారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని బలపర్చేలా ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
JC Prabhakar Reddy: అనంతపురం టీడీపీ ఎంపీ స్థానంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్