JC Prabhakar Reddy: అనంతపురం టీడీపీ ఎంపీ స్థానంపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆసక్తికర కామెంట్స్

ఏపీలో ప్రజా సమస్యలపై జేసీ కుటుంబం పోరాడిన విధంగా ఎవరైనా పోరాడారా అని ప్రభాకర్‌ రెడ్డి నిలదీశారు.

JC Prabhakar Reddy: అనంతపురం టీడీపీ ఎంపీ స్థానంపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆసక్తికర కామెంట్స్

JC Prabhakar Reddy

Updated On : January 28, 2024 / 6:51 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ అనంతపురం టీడీపీ ఎంపీ స్థానంపై తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యూట్యూబ్‌లో వచ్చిన కథనాలన్నీ వాస్తవాలు అవుతాయా అని ప్రశ్నించారు.

ఏపీలో ప్రజా సమస్యలపై జేసీ కుటుంబం పోరాడిన విధంగా ఎవరైనా పోరాడారా అని ప్రభాకర్‌ రెడ్డి నిలదీశారు. అనంతపురం జిల్లాలో ఇంత వరకు రెండుసార్లు మాత్రమే బీసీ నాయకులు గెలిచారని చెప్పారు. 2019 నుంచి ప్రజా సమస్యలపై తాను పోరాడుతున్నానని తెలిపారు.

తనపై ఇప్పటివరకు 88 కేసులు నమోదయ్యాయని జేసీ ప్రభాకర్‌ రెడ్డి చెప్పారు. చంద్రబాబు నూటికి నూరు శాతం తమ కుటుంబాన్ని ఆదరిస్తారని అన్నారు. కాగా, కొన్ని వారాల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో టీడీపీ, జనసేన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులపై తుది నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ సమయంలో జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఈ కామెంట్లు చేశారు.

Nara Lokesh: మాట్లాడాలంటే నాకు బాధగా ఉంది: నారా లోకేశ్