Nara Lokesh: మాట్లాడాలంటే నాకు బాధగా ఉంది: నారా లోకేశ్  

రాజధాని పోరాటంలో ఆయనను అన్యాయంగా అరెస్టు చేశారని చెప్పారు. నీతి, నిజాయితీకి మారుపేరు జయదేవ్ అని అన్నారు.

Nara Lokesh: మాట్లాడాలంటే నాకు బాధగా ఉంది: నారా లోకేశ్  

Nara Lokesh

Updated On : January 28, 2024 / 4:49 PM IST

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు టీడీపీ నేత, ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించిన నేపథ్యంలో గుంటూరులో ఆయనకు కృతజ్ఞతాభివందన సభను ఏర్పాటు చేశారు. ప్రెవేటు పంక్షన్ హాల్లో జరిగిన ఈ సభలో పలువురు టీడీపీ నేతలు హాజరై మాట్లాడారు.

నారా లోకేశ్ మాట్లాడుతూ.. తనకు మాట్లాడాలంటే బాధగా ఉందని అన్నారు. 2019 ఎన్నికల నుంచి వారానికి ఒకసారైనా జయదేవ్‌తో మాట్లాడుతున్నానని తెలిపారు. రాజధాని పోరాటంలో ఆయనను అన్యాయంగా అరెస్టు చేశారని చెప్పారు. నీతి, నిజాయితీకి మారుపేరు జయదేవ్ అని అన్నారు.

జయదేవ్ ఈ నిర్ణయం తీసుకోవటం పట్ల తనకు బాధగానే ఉందని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. జయదేవ్ ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారని తెలిపారు. ఎన్నో విషయాలపై ఇద్దరం కలిసి పార్లమెంటులో గళం వినిపించామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఎంతో గొప్పగా జయదేవ్ పార్లమెంటులో మాట్లాడారని తెలిపారు. త్వరలోనే రాజకీయాల్లోకి జయదేవ్ వస్తారని ఆశిస్తున్నానని చెప్పారు.

గల్లా అరుణకుమారి మాట్లాడుతూ.. పార్లమెంటును గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనక మేడల శాసించేవారని అన్నారు. తమది నీతి, నియమాలను పాటించే కుటుంబమని తెలిపారు. జయదేవ్ కోసమే తామంతా టీడీపీలో చేరామన్నారు. తామంతా వైసీపీలో చేరుతున్నామంటూ ప్రచారం జరిగిందని, తాము ఏ పార్టీలోకీ వెళ్లేది లేదని చెప్పారు.

Chandrababu Naidu: ఇక దేవుడు కూడా కాపాడలేడు.. సినిమా అయిపోయింది: జగన్‌పై చంద్రబాబు కామెంట్స్